అదేం కిరీటం కాదు.. ‘మా’ ఎన్నికలపై మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు

by Anukaran |
Dr. Mohan Babu
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో ‘మా’ ఎన్నికల హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయ నాయకులకు ఏమాత్రం తీసిపోకుండా సినీ నటులు సైతం వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా.. ‘మా’ ఎన్నికలపై డాక్టర్ మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మా’ అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదని, అదొక బాధ్యత అని అభిప్రాయపడ్డారు. తన క్రమశిక్షణకు, కమిట్‌మెంట్‌కి వారసుడు విష్ణు అని వెల్లడించారు. ఏ సమస్య వచ్చినా.. విష్ణు ‘మా’ సభ్యుల పక్కన ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. ‘మా’ సభ్యులు తమ ఓటును విష్ణు ప్యానెల్‌కు వేయాలని కోరుకుంటున్నానని కోరారు.

Advertisement

Next Story