డజన్ మామిడి పళ్లకు రూ. 1.2 లక్షలు

by Shyam |
Mangos
X

దిశ, ఫీచర్స్: పాండమిక్ పరిస్థితులు ఉద్యోగ, వ్యాపారస్తులను కోలుకోలేని దెబ్బతీసిన విషయం తెలిసిందే. ప్రత్యేకించి స్ట్రీట్ వెండర్స్‌కు, రోజువారీ కూలీలకు ఎక్కడలేని కష్టాలు తెచ్చిపెట్టింది. ఉపాధి కోల్పోవడంతో పిల్లల చదువులపైనా ఆ ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం లేక జంషెడ్‌పూర్‌లోని తులసీ కుమార్ అనే బాలిక చదువుకు దూరమై.. రోడ్‌సైడ్ మామిడి పళ్లు విక్రయిస్తూ ఫ్యామిలీకి ఆసరాగా నిలుస్తోంది.

కాగా, మీడియా ద్వారా తులసి గురించి తెలుసుకున్న బిజినెస్ మ్యాన్ అమేయ హెటే.. తనకు హెల్ప్ చేసేందుకు ముందుకొచ్చాడు. ఈ క్రమంలో తులసి దగ్గర డజన్ మామిడి పళ్లను రూ.1.2 లక్షలకు కొనుగోలు చేశాడు. అలా ఒక్కో మామిడి పండుకు రూ.10000 చెల్లించాడు. ఆ మెుత్తం డబ్బును ఆమె తండ్రి అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసిన అమేయ.. ఇంటర్నెట్ సదుపాయంతో కూడిన రూ.13000 విలువల గల ఫోన్ కూడా గిప్ట్‌ ఇచ్చాడు. ఇక తన సాయం గురించి మాట్లాడుతూ.. తులసి చాలా హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ అని, తమ సాయంతో చదువు పూర్తిచేస్తే చాలా ఆనందిస్తామని వెల్లడించాడు. అంతేకాదు ఫ్యూచర్‌లో తనకు ఏ అవసరమొచ్చినా సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించాడు.

Advertisement

Next Story

Most Viewed