విద్యుత్ చార్జీలు వ‌సూలు చేయొద్దు

by Shyam |
విద్యుత్ చార్జీలు వ‌సూలు చేయొద్దు
X

దిశ, నల్లగొండ:
లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజల నుంచి 3నెలల వ‌ర‌కు విద్యుత్ చార్జీలు వసూలు చేయవద్దని వైయస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ రహీం షరీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణకు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ఉపాధి క‌రువై ప్ర‌జ‌లు అర్ధాక‌లితో అల‌మ‌టిస్తున్నార‌ని వివరించారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకుల కోసం డబ్బులు పంపిణీ చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. ఈ విధంగా మూడు నెల‌ల వ‌ర‌కు పేద‌ల‌కు పంపిణీ చేయాల‌ని ఆయన కోరారు. విద్యుత్ శాఖ అధికారులు ఒక‌టో తారీఖు నుంచి ఇళ్ల వద్దకు వచ్చి క‌రెంట్ బిల్లులు వ‌సూల చేయ‌డానికి రానున్నందున బిల్లులు వ‌సూలు చేయకుండా సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వాల‌ని కోరారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌తో పాటు వ‌ల‌స కార్మికుల‌ను సైతం రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదుకోవ‌డం అభినందించదగ్గ విషయమన్నారు.

Tags: carona,lockdown, dont collect electricity charges, ysrcp leadr rahim

Advertisement

Next Story

Most Viewed