తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దు : ఏసీపీ

by Shyam |
తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దు : ఏసీపీ
X

దిశ, మెదక్: వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మి భయాందోళనలకు గురి కావొద్దని సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ తెలిపారు. గత రెండు, ముడు రోజుల నుంచి వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా తప్పుడు ప్రచారాలు వైరల్ అవుతున్నాయన్నారు. ఉదయం 9 గంటల వరకు నిత్యావసర వస్తువుల షాపులు, కూరగాయల మార్కెట్లు, మెడికల్ షాపులు తెరిచి ఉంటాయని, ఉదయం 9 గంటల తర్వాత అన్ని రకాల షాపులు, మూసి వేస్తారని, ఎవరు రోడ్లపైకి రావద్దని, వస్తే చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ నిబంధనలను అందరూ పాటించాలన్నారు.

Tags : false, propaganda, social media, ACP rameshwar, medak, whatsap

Advertisement

Next Story

Most Viewed