- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానవ లక్షణాలతో డాల్ఫిన్స్
దిశ, ఫీచర్స్ : అన్ని జంతువుల్లోకెల్లా డాల్ఫిన్స్ చాలా తెలివైనవిగా భావిస్తుంటారు. ఇవి మనుషులతో స్నేహపూర్వకంగా, సరదాగా ఉంటాయన్నది తెలిసిన విషయమే. కాగా మానవుల మాదిరే, డాల్ఫిన్లు కూడా వ్యక్తిత్వ భావాలను పంచుకుంటాయని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. ప్రపంచం నలుమూలల నుంచి 100కు పైగా డాల్ఫిన్స్‌ను పరిశీలించిన పరిశోధకులు.. అవి చాలా తొందరగా కలిసిపోతాయని, వాటిలోనూ ఆసక్తితో పాటు అధిక ఉత్సాహం ఉంటుందని తేల్చారు. అంతేకాదు డాల్ఫిన్లకు సృజనాత్మకత కూడా ఎక్కువని, అధిక తెలివితేటలతో పాటు సామాజిక సామర్థ్యాలను ప్రదర్శిస్తాయని తెలిపారు. ఈ అధ్యయనం ప్రకారం 95 మిలియన్ సంవత్సరాల క్రితం డాల్ఫిన్లు ఇతర క్షీరదాల నుండి వేరుగా ఉన్నాయి. స్నేహంగా ఉండటంతో పాటు కుటుంబాలు, సమాజాలను కలుపుకుంటూ స్వేచ్ఛగా జీవించాయి.
కోతులు, ఏప్స్‌లో మాత్రం మనుషుల మాదిరిగానే లేదా సమానమైన వ్యక్తిత్వ లక్షణాలను కలిగి ఉన్నాయని పరిశోధకులు ఇప్పటివరకు భావించగా.. డాల్ఫిన్స్‌లోనూ అవే లక్షణాలు ఉన్నాయని మొదటిసారిగా డాక్టర్ మోర్టన్ బృందం కనుగొంది. ‘డాల్ఫిన్లు, అనేక ప్రైమేట్ల(కోతిజాతులు) మాదిరిగానే పెద్ద మెదడు కలిగి ఉంటాయి. అంతేకాదు మనుషులు వ్యక్తిగత సంబంధాలు ఏర్పరుచుకున్న విధంగానే డాల్ఫిన్లు కూడా తమ జీవిత కాలంలో అనేక బంధాలను ఏర్పరచుకుంటాయి. డాల్ఫిన్లు ప్రదర్శించే లక్షణాల పూర్తి వర్ణపటాన్ని గుర్తించే విషయంలో ఇది ప్రారంభం మాత్రమే. తదుపరి అధ్యయనాలను నిర్వహించడానికి ఈ విషయాలు దోహదపడతాయి. ఎందుకంటే ఈ అధ్యయనం కేవలం మహాసముద్రాల లోతుల్లో నివసించే జాతుల పట్ల ఓ అవగాహన ఏర్పచడానికి మాత్రమే పరిమితం కాదు, మన గురించి మనం బాగా అర్థం చేసుకోవడానికి దారితీస్తుంది’ అని హల్ యూనివర్సిటీ శాస్ర్తవేత్త డాక్టర్ మోర్టన్ అన్నారు.