- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుక్క ఆత్మహత్య.. ఏడుపును ఆపుకోగలరా..
దిశ, వెబ్‌డెస్క్: ఆధునిక యుగంలో నమ్మకం, విశ్వాసం అనే పదాలకు చోటు లేకుండా పోయింది. ఎక్కడ చూసిన మోసాలు, ఆస్తుల కోసం కుటుంబీకులు, తొడబుట్టిన వారినే చంపుకుంటున్న ఈ రోజుల్లో ఓ కుక్క తనను సాకిన యాజమానిపై అమితమైన ప్రేమను కనబరిచింది. అనారోగ్యంతో చనిపోయిన యాజమానిని మర్చిపోలేక, నాలుగంతస్థుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
సాధారణంగా కుక్కలు విశ్వాసానికి మారుపేరు. ఓ ముద్ద పెడితే చాలు అది బతికినన్ని రోజులు నమ్మకంగా ఉంటూ.. ఇంటికి కాపలా కాస్తుంది. తన వాళ్లు కనిపించకపోతే కన్నీటి పర్యంతమవుతుంది. యజమానికి బయటకు వెళ్లి వస్తే అమాంతం మీద దూకి దాని సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది. అలాంటి శునకాలను మనం నిజ జీవితంలో చాలానే చూశాం. కానీ, యజమాని మరణవార్త తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న శునకాన్ని చూశారా..బహుశా ఇదే మొదటి సారి..ఇదే ఆఖరిసారి కూడా కావొచ్చు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కాన్పూర్ పట్టణంలో నివసించే డాక్టర్ అనితా రాజ్ సింగ్ 12ఏండ్ల కిందట వీధిలో గాయాలతో పడి ఉన్న ఓ చిన్న కుక్కపిల్లను ఇంటికి తీసుకొచ్చింది. దానికి వైద్యం అందించి చావుబతుకుల నుంచి కాపాడింది. నాటి నుంచి ఆ శునకం ఇంట్లో ఓ మనిషిలా కలిసిపోయింది. అయితే, డాక్టర్ అనితా రాజ్ సింగ్ అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 1న మరణించింది. ఇన్ని రోజులు తనకు సాకిన యజమాని మరణం చూసి తట్టుకోలేకపోయిన ఆ శునకం కూడా ఆత్మహత్యకు పాల్పడింది. నాలుగంతస్థుల బిల్డింగ్ మీద నుంచి దూకడంతో వెన్నుపూస విరిగిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. అప్పటికే అది మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ విషయం ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లో వైరల్‌గా మారింది.