- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గర్భిణుల నుంచి శిశువులకు కరోనా వ్యాపిస్తుందా?
దిశ, వెబ్ డెస్క్: కరోనా భూతం కారణంగా యావత్ ప్రపంచమే వణికిపోతోంది. అది ఎప్పుడూ ఏ రూపంలో తమను చేరుతుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ వైరస్ బారిన పడితే ఇక మృత్యువు ఒడిలోకి తీసుకెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయని, ఈ వ్యాధి చిన్నపిల్లలు, వృద్ధులకైతే ఈ వ్యాధి త్వరగా సోకుతుందని, ఆ తర్వాత వారి శరీరం చికిత్సకు అంతగా సహకరించదని, దీంతో చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పలువురు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వారు సూచిస్తున్నారు. ఇలాంటి భయంకరమైన వ్యాధి విషయంలో చాలా మంది గర్భిణులు, వారి బంధువులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఆ వ్యాధి తమకు సోకితే గర్భంలో ఉన్న తమ శిశువుకు కూడా ఎక్కడ వ్యాపిస్తుందోనని వారు మథనపడుతున్నారు.
గర్భిణులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ఒకవేళ కరోనా వైరస్ గర్భిణీకి సోకినా కూడా ఆమె నుంచి శిశువుకు వ్యాపించదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై గత నెలలో చైనాకు చెందిన పలు మెడికల్ యూనివర్సిటీలు అధ్యయనం చేశాయి. అప్పుడు ఇదే రుజువైందని వారు వెల్లడిస్తున్నారు. ఒకవేళ తల్లి నుంచి శిశువుకు వ్యాపించిన కూడా పెద్దగా భయపడాల్సిన అవసరంలేదని, అంతగా వారిపై ప్రభావం చూపై అవకాశాలు ఉండబోవని వారు చెబుతున్నారు. అందువల్ల ఈ విషయంలో గర్బిణులు భయపడాల్సిన అవసరంలేదు.
Tags: pregnant mother, coronavirus tension, Transmit, newborn babies