వైద్యులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : అమిత్ షా

by vinod kumar |
వైద్యులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : అమిత్ షా
X

న్యూఢిల్లీ : కరోనావైరస్ కట్టడి చర్యల్లో ముందుండి పోరాడుతున్నవారిలో వైద్యులు ప్రధానం. కానీ, దేశవ్యాప్తంగా పలుచోట్ల వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు నిరసనగా ఈ నెల 23న బ్లాక్‌డేగా పాటించబోతున్నట్టు ఇండియన్ మెడికల్ అసొసియేషన్(ఐఎంఏ) ప్రకటించింది. కాగా, ఈ సింబాలిక్ నిరసన ప్రకటన వచ్చిన నేపథ్యంలో కేంద్రం ఐఎంఏ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశమయ్యారు. ఈ కాన్ఫరెన్స్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలు.. వైద్యుల సేవలను కొనియాడుతూ..వారి రక్షణకు హామీనిచ్చారు. ప్రభుత్వం వైద్యుల వెంటే ఉంటుందని, వారి రక్షణకు కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటుందని భరోసానిచ్చినట్టు సమాచారం. డాక్టర్ల సేఫ్టీ, డిగ్నిటీలు అత్యంత ప్రాధాన్యమైనవని, అన్ని వేళలా వారి చుట్టు భద్రతమైన వాతావరణం ఉండేలా చూడటం మనందరి బాధ్యత అని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. వైద్యుల భద్రతకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని హామీనిచ్చారు. కాబట్టి వైద్యులు.. తమ నిరసనను విరమించుకోవాలని సూచించారు. కేంద్రం హామీనిచ్చిన తర్వాత ఐఎంఏ నిరసనను ఉపసంహరించుకుంది.

Tags: coronavirus, doctors, symbolic, protest, doctors

Advertisement

Next Story

Most Viewed