- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజీనామాలు వెనక్కి.. విధుల్లో చేరిన డాక్టర్లు
దిశ, నిజామాబాద్ వైద్యులతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జరిపిన చర్చలు ఫలించాయి. రాజీనామాను వెనక్కి తీసుకుని విధుల్లో చేరడానికి ఆరుగురు వైద్యులు అంగీకారం తెలిపారు. సమస్యల పరిష్కారం కోరుతూ కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఆరుగురు రాజీనామా చేసిన విషయం విధితమే. వారితో కలెక్టర్ శరత్‌కుమార్ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవుట్ పేషెంట్లు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని వైద్యులు కలెక్టర్‌ను కోరారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్, సూపరిండెంట్ హామీ ఇవ్వడంతో రాజీనామాలను వెనక్కి తీసుకుని విధుల్లో చేరుతామని వైద్యులు ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోతురే, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, అజయ్ కుమార్, వైద్యులు పాల్గొన్నారు.
Tags: Nizamabad, collector, sharath, doctors, resign