అనుమానాస్ప‌ద స్థితిలో డాక్ట‌ర్ హేమ‌ల‌త మృతి

by Sumithra |
అనుమానాస్ప‌ద స్థితిలో డాక్ట‌ర్ హేమ‌ల‌త మృతి
X

దిశ, ఖ‌మ్మం: వైబ్రెంట్స్ ఆఫ్ క‌లాం రాష్ట్ర మ‌హిళా బాధ్యురాలు డాక్ట‌ర్ ల‌గ‌డ‌పాటి హేమ‌ల‌త అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో మంగళవారం జరిగింది. వివరాళ్లోకి వెళితే.. ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని క‌విరాజ్‌న‌గ‌ర్‌లోని త‌న నివాసంలో హేమ‌ల‌త విగ‌తజీవిగా ఉండ‌టాన్ని గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే అక్క‌డికి చేరుకున్న పోలీసులు వెళ్లి చూడగా, అప్పటికే మరణించి ఉంది. అనంతరం ఆమె మృత‌దేహాన్ని పోస్టుమార్టంకు తర‌లించారు. ఆమె మ‌ర‌ణం అనుమానాస్ప‌దంగా ఉంద‌ని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మ‌హ‌త్యా?, హ‌త్యా? అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకునేంత భ‌య‌స్తురాలు కాద‌ని బంధువులు చెబుతున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed