అనాథాశ్రమానికి వైద్యుడి సాయం

by Shyam |
అనాథాశ్రమానికి వైద్యుడి సాయం
X

దిశ, వరంగల్: కరోనా నేపథ్యంలో పేద ప్రజలతో పాటు పలుసేవా సంస్థలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వారికి ఫండ్స్ నిలిచిపోవడంతో తమపై ఆధారపడి ఉన్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లాలోని ఓ అనాథ ఆశ్రమానికి గడ్డు కాలం వచ్చింది. స్థానికంగా ఉండే వైద్యుడు అందులోని పిల్లలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆ ఆశ్రమానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తన ఔదార్యాన్ని చాటాడు. ఆయనే డాక్టర్ అంజిరెడ్డి..వేదా ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్వహిస్తున్నాడు. జనగామ మండలం చీటకోడూరు రోడ్డులోని వర్ధన్ అనాథాశ్రమానికి నెల రోజులకు సరిపడా సరుకులతో పాటు రూ.2వేల నగదు పంపిణీ చేశారు.

Tags : corona, lockdown, one month goods, warangal doctor donate, orphanage

Advertisement

Next Story

Most Viewed