- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘డబుల్’ సాగదీశుడే.. ఇంకెన్ని రోజులంటున్న లబ్దిదారులు
దిశప్రతినిధి, రంగారెడ్డి : ఇళ్లు లేని ప్రతీ పేదవాడికి డబుల్ బెడ్ రూం కేటాయిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి ఆశపడిన రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలో ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కేటాయించిన దాఖలాలు లేవు. జిల్లాలో 6,645 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్ల కిందట మంజూరు చేసింది.
కానీ, సుమారుగా 89,700 మంది లబ్ధిదారులు డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేద ప్రజలతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్లకు పొంతన లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం సరియైన క్రమంలో డబుల్ బెడ్ రూం ఇండ్లకు నిధులు కేటాయించకపోవడంతోనే నిర్మాణంలో జాప్యం జరుగుతుందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అందుకు క్షేత్రస్ధాయిలోని ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వానికి వంత పాడుతున్నట్లు తెలుస్తోంది.
డబుల్ బెడ్ రూం పేరుతో రాజకీయం..
అధికార టీఆర్ఎస్ పార్టీలోని కొంత మంది వ్యక్తులు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామని పేదల ప్రజలకు ఆశచూపించి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో జిల్లాలోని అనేక మంది పేదలు ఇప్పటికే డబ్బులు ఇచ్చి ఇళ్లు వస్తాయా? రావా.. అని భయాందోళనకు గురవుతున్నారు.అయితే, ఆ వివరాలను బహిర్గతం చేసేందుకు బాధితులు ఇష్టపడటం లేదు. ప్రధానంగా జిల్లాలోని అబ్ధుల్లాపూర్ మెట్, మహేశ్వరం, చేవెళ్ల, మొయినాబాద్ మండలాల్లో ఈ తంతు నడుస్తున్నట్టు సమాచారం.
–రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో 1,060 ఇండ్ల నిర్మాణానికి 64.6 ఎకరాలు, కల్వకుర్తిలో 738 ఇండ్లకు 43.25 ఎకరాలు, ఇబ్రహీంపట్నంలో 1,239 ఇండ్లకు 50.04 ఎకరాలు, మహేశ్వరంలో 400 ఇండ్లకు 12.22 ఎకరాలు, రాజేంద్రనగర్‌లో 240 ఇండ్లకు 9.25 ఎకరాలు, షాద్‌నగర్లో 3,100 ఇండ్లకు 95.17 ఎకరాలు కేటాయించింది.
–సివిల్ వర్క్స్ పూర్తయినప్పటికీ విద్యుత్, వాటర్, ఫ్లోరింగ్, కలరింగ్, కాంపౌంద్వాల్, లిఫ్ట్ ఏర్పాటు వంటి పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
–రూ.20 కోట్లు కేటాయిస్తే ఈ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో పనులన్నీ పెండింగ్లో ఉండి లబ్దిదారులకు ఎదురు చూపులు తప్పడం లేదు.
–పేదలకు సొంతిల్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం 2015-16, 2016-17 వార్షిక సంవత్సరాల్లో జిల్లాకు 6,777 డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించింది. వీటిలో 6,645 ఇండ్లను నిర్మించేందుకు జిల్లా కమిటీ అంగీకరించింది.
జిల్లాలో ఇండ్ల పరిస్థితి ఇలా..
*మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నావారు : 89,700
*ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్రూం ఇండ్లు : 6,645
*16 మున్సిపాలిటీలకు కేటాయింపు : 2,800
*గ్రామాలకు కేటాయించిన ఇండ్లు : 3,977
*నిర్మాణాల కోసం కేటాయించిన భూమి (ఎకరాల్లో) : 275.09
*ఇప్పటికే టెండర్ పిలిచినవి : 6,383
*పని పురోగతిలో ఉన్నవి : 2,757
*కేటాయింపునకు సిద్దంగా ఉన్నవి : 2,221
ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుని రెండేళ్లు..
మీ సేవలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కోసం దరఖాస్తు చేసి రెండేళ్లు గడిచింది. ఇప్పటివరకు ప్రభుత్వం ఇండ్లు కేటాయించలేదు. నేను మున్సిపాలిటీలో నివసిస్తున్నాను. నాకు ఇంతవరకు ఇల్లు మంజూరు కాలేదు. సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో నివసిస్తున్నాము. వేలకు వేలు అద్దె చెల్లించాలంటే ఇబ్బందిగా ఉంది. ఇదిగో వస్తది అదిగో వస్తది అంటున్నారు. ఇల్లు త్వరగా మంజూరు చేయాలని కోరుతున్నాం. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి.