Ganesh Chaturthi స్పెషల్ నైవేద్యంగా ఏది పెట్టాలో తెలుసా..?

by Anukaran |   ( Updated:2021-09-09 07:20:52.0  )
lord ganesha prasadam
X

దిశ, వెబ్‌డెస్క్: వినాయక చవితి వచ్చేసింది. భోజన ప్రియుడు బొజ్జ గణపయ్యకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి ఆయన కృపకు పాత్రులు కావాలనుకునే వారు చాలా మందే ఉంటారు. అయితే కొందరు ఏ నైవేద్యం పెట్టాలి.. ఏలా పెట్టాలి అనే విషయం తెలియక తర్జనభర్జన అవుతుంటారు. అలాంటి వారి కోసం ‘దిశ’ వంటలు మీముందుకు తెచ్చింది ఈ శీర్షిక.. మరి ఆ నైవేద్యాలేంటో ఇప్పుడు చూద్దాం..

గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా స్వామి వారికి ఇష్టమైన నైవేద్యాలలో ప్రథమమైనవి వడపప్పు, పానకం, చలిమిడి. వడపప్పు అంటే పెసరపప్పును నానబెట్టి తీసివేయాలి. ఇంకా ఆయనకు చలిమిడి అంటే ఇష్టం కాబట్టి.. ఉడికించిన చలిమిడి కాకుండా పచ్చి చలిమిడి అంటే బియ్యం పిండిలో బెల్లం కలిపి తయారు చేయాలి. పండ్లలో అరటిపండు, కొబ్బరికాయ అంటే ఆయన ప్రీతికరం. అయితే ఆయనకు ఎన్నిరకాల పండ్లు దొరికితే అన్ని రకాల పండ్లు నివేదించవచ్చు.

వీటితో పాటు పండ్లలో ముఖ్యమైనది వెలగపండు అంటే ఆయన ఇష్టం. వీటితో పాటు మనం ఇంట్లో తయారు చేసేవి కుడుములు, ఉండ్రాళ్లు, పాలతాలికలు అంటే ఆయనకు బాగా ఇష్టం. అంతేకాకుండా అటుకులు-బెల్లం, చెరుకు గడలు కూడా సమర్పించవచ్చు. నవరాత్రులు తొమ్మదిరోజులు మీరు ఒక్కొ నైవేద్యాన్ని సమర్పించి ఆ లంబోదరుడి ఆశీస్సులు పొందాలని ఆశిస్తూ.. దిశ

దిశ.. పండుగ వార్తలు..వినాయకుని పూజా విధానంపై
దిశ స్పెషల్..1. వినాయక మహిమలు ఇవే..2. గణేశుడి పూజా విధానం ఎట్టిదనిన..3. ఈ శ్లోకాలు చదవడం తప్పనిసరి…

Advertisement

Next Story

Most Viewed