- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండస్ట్రీకి రాకముందు రాంగోపాల్ వర్మ ఏం చేశావాడో తెలుసా.. ?
దిశ, వెబ్‌డెస్క్ : వివాదాలకు కేరఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ.. ఎవ్వరేమనుకున్నా.. తనకు నచ్చినట్లు బతకడమే రాంగోపాల్ వర్మ ఫిలాసఫీ. వివాదాలు సృష్టించడంలో, వాటికి వివరణ ఇవ్వడంలో వర్మకు మించిన తోపు లేడన్నది అభిమానుల మాట. అయితే ఇండస్ట్రీలోకి రావడానికి రాంగోపాల్ వర్మ చేసిన ప్రయత్నాలు.. తన ఆటిట్యూడ్‌తో వచ్చిన కష్టాలు తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. డైరెక్టర్ కావాలని ఎంతో మందికి కల ఉంటుంది. కానీ, ఆ కలను కొంత మంది మాత్రమే సాకారం చేసుకోగలరు. అలానే రాంగోపాల్ వర్మ కూడా తాను డైరెక్టర్ కలను నిజం చేసుకున్నాడు.
దెయ్యం సినిమా కథను అప్పుడే రాసుకున్నా..
ఇండస్ట్రీకి రాకముందు కొంత మంది నటీనటులు, దర్శకులు ఎదో ఒక చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. వారు ఇండస్ట్రీలోకి వచ్చాక ఏదో ఒక ఇంటర్వూలో నేను అప్పుడు ఈ పని చేసేవాడిని అని తమ లైఫ్ స్టోరిస్ చెప్తుంటారు.. వారి లైఫ్ స్టోరీలు చాల ఇన్స్పైర్‌గా ఉంటాయి. ఇలా వివాదాల దర్శకుడు కూడా ఇండస్ట్రీకి రాకముందు అమీర్ పేటలోని ఓ సినిమా క్యాసెట్స్ షాప్ నడిపేవారు.. అలా అక్కడికి సినిమా వాళ్ళు వస్తుండడంతో వారితో పరిచయాలు ఏర్పడటం అప్పటి నుంచే సినిమాలకు గురించి స్టడీ చేయడం మొదలుపెట్టానంటూ వర్మ ఓ ఇంటర్వూలో తెలిపారు.
ఇక వర్మ ఆలోచనా విధానం గురించి తెలిసిందే.. తాను ఏది చేసినా కొత్తగా ఉండాలనుకుంటాడు. అలా ఆ కాలంలోనే ఇండస్ట్రీలో ఏదైనా కొత్తగా చేయాలన్న ఉద్దేశ్యంతో దెయ్యం సినిమా కథను అప్పుడే రాసుకున్నారు, అలా వర్మ కథలు రాయడం మొదలు పెట్టాడు. దాని తర్వాత చాలా సార్లు అవకాశాల కోసం ఎదురు చూశారు కానీ, వర్మ రాసిన కథలు బాగున్నా దర్శకులకు నచ్చకపోవడంతో విసిగిపోయిన వర్మ సినిమాలోని మెలుకువలను నేర్చుకుంటాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వమని దర్శకుడు వెంకట్‌ను కోరగా అలా.. నాగార్జున చేస్తున్న కలెక్టర్ గారి అబ్బాయి సినిమాకి అయిదో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. కానీ వర్మకున్న ఆటిట్యూడ్ వల్ల సెట్లో ఎవరికి నచ్చేవాడు కాదంటా.. దాంతో అతన్ని ఆ సినిమా నుంచి తొలిగించారు. అయినా వర్మ మాత్రం సినిమాను వదలలేదు దూరంగా ఉండి మరీ సినిమా ఎలా తీస్తున్నారని.. అందులోని మెలుకువలను తెలుసుకున్నాడు. అలా నేర్చుకున్న పరిజ్ఞానం, బుక్స్‌తో సంపాదించిన నాలెడ్జ్ శివ సినిమాకి చాలా ఉపయోగపడిందని వర్మ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. శివ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మ పేరు ఎంత మారుమోగింది అందరికీ తెలిసిందే.