భూమి వైపు ఎన్ని నక్షత్రాలు చూస్తున్నాయో తెలుసా?

by Sujitha Rachapalli |   ( Updated:2021-07-14 03:24:45.0  )
earth
X

దిశ, ఫీచర్స్ : విశ్వంలోని ఇతర గ్రహాలపై జీవాన్వేషణకు కోసం ప్రపంచ దేశాలు తమ పరిశోధనల్లో వేగం పెంచగా.. సమీప భవిష్యత్‌లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు సౌర కుటుంబాన్ని పోలిన ఇతర గ్రహ కూటములు ఉండే అవకాశం ఉందనే వాదనలు కూడా ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. కానీ శాస్త్రీయంగా నిర్ధారించబడలేదు. అయితే శక్తివంతమైన టెలిస్కోపుల సాయంతో భూ గ్రహానికి ఆవల జీవనానికి సంబంధించిన జాడ కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్న సంగతి తెలిసిందే. మరి ఇతర సౌర వ్యవస్థల నుంచి కూడా భూమిపై జీవనం కోసం అలాగే చూస్తుంటారని ఎప్పుడైనా అనుకున్నారా? అదే నిజమైతే ఎన్ని నక్ష్రతాలు మనల్ని చూస్తున్నాయనే ప్రశ్నకు సైంటిస్టులు ఏం సమాధానం చెబుతున్నారో తెలుసా..?

సుమారు 5 వేల సంవత్సరాల క్రితం ఆదిమానవుల నాగరికత మొదలయ్యే నాటికే, సూర్యుని నుంచి 100 పార్సెక్స్(1 పార్సెక్‌కు 3.26 కాంతి సంవత్సరాలు) పరిధిలోని 1715 నక్షత్రాలు.. భూమిపై జీవరాశిని పరిశీలిస్తున్నాయని నివేదికలో వెల్లడించారు. కార్నెల్ యూనివర్సిటీ సైంటిస్టుల స్టడీ ప్రకారం రాబోయే 5 వేల సంవత్సరాల్లో అదనంగా 319 నక్షత్రాలు ఈ లిస్టులో చేరనున్నట్టు తెలిసింది. భూమికి సమీపంలోని గ్రహాలపై జీవులను గుర్తించేందుకు టెలివిజన్, రేడియో వేవ్స్ రూపంలో గత 100 సంవత్సరాలుగా అంతరిక్షంలోకి పంపుతున్న సంకేతాల ద్వారా ఇలాంటి 75 నక్షత్రాలను గుర్తించినట్టు అధ్యయన రచయితలు లిసా కల్టెనెగర్, జాకీ ఫాహెర్టీ చెప్పారు.

Read more: యూరప్‌లోని ఎత్తైన శిఖరంపై రెపరెపలాడిన జాతీయ జెండా..

Advertisement

Next Story

Most Viewed