సన్ గ్లాసెస్ చరిత్ర, వాటిని ఎందుకు తయారు చేశారో తెలుసా?

by Anukaran |   ( Updated:2021-03-10 22:21:23.0  )
సన్ గ్లాసెస్ చరిత్ర, వాటిని ఎందుకు తయారు చేశారో తెలుసా?
X

దిశ,వెబ్‌డెస్క్: సమ్మర్ సీజన్ లో కాలు బయటపెట్టాలంటే బయపడతారు జనం. టూవీలర్ పై ప్రయాణం అంటే ఇప్పుడు వద్దులే అని అనేస్తుంటారు చాలామంది. ముఖ్యంగా మన భాగ్యనగరం లాంటి బిజీ సిటీల్లో ప్రయాణం ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తుంటుంది. కిక్కిరిసిన ట్రాఫిక్ లో దుమ్ము,దూళి ఎగిసిపడుతుంటే ఆ ప్రయాణం ఎంత చిరాకుగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. పొల్యూషన్ తో తెగ ఇబ్బంది పడుతుంటారు వాహనదారులు. ఎండాకాలంలో సూర్య కాంతి ప్రకాశం వంతంగా ఉండడమే గాక కంటికి సమస్యను కలిగించే అతి నీల లోహిత కిరణాలను ఎక్కువగా వెదజల్లుతుంది. ఆల్ట్రావయోలెట్ కిరణాల బారి నుంచి కళ్లను అన్నీ విధాలుగా రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కళ్లకు రక్షణగా ఉంటున్నాయి సన్ గ్లాసెస్. ఒక పక్క ఎండవేడిమి, మరోపక్క దుమ్ము, దూళిల నుంచి కళ్లను కాపాడుతున్నాయి. ఎక్కువ మంది వాహన దారులు హెల్మెట్ కన్నా సన్ గ్లాసెస్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. మరి రోజూ వారి జీవితంలో భాగమైన సన్ గ్లాసెస్ పుట్టుక వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ దాగుంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటని అనుకుంటున్నారా?

చరిత్ర ఆధారంగా పూర్వ కాలంలో పలు జాతులకు చెందిన ప్రజలు సూర్య కిరణాలు కంటిపై ప్రభావాన్ని చూపకుండా ఉండేందుకు జంతువుల దంతాల్ని చదునుగా చేసి వాటిని వినియోగించేవారు. ఆ తరువాత రోమ్ మరియు చైనా చరిత్ర ప్రకారం రోమన్ చక్రవర్తి నీరో తాను శిక్షణ ఇచ్చిన సైనికుల పోరాటాల్ని పాలిష్ చేసిన రత్నాలను ధరించి చూసినట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగానే సన్ గ్లాసెస్ పుట్టుకొచ్చాయని చరిత్రకారులు చెబుతారు. ఇక చైనాలో సన్ గ్లాసెస్ సాధారణంగా 12 వ శతాబ్దానికంటే ముందే ఉపయోగించినట్లు చరిత్రకారులు పలు ఆధారాల్ని బయటపెట్టారు.

12వ శతాబ్దంలో ఈ సన్ గ్లాసెస్ ప్రధానంగా గోధుమ, బూడిద రంగు లేదా నలుపు రంగురాళ్లతో తయారు చేసేవారు. రత్నాల ఆకారంలో ఉండే ఈ సన్ గ్లాసెస్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు. సూర్యుని కిరణాలు నేరుగా కంటిని తాకేవి. మరి ఉపయోగం లేని ఈ సన్ గ్లాసెస్ ను ఎందుకు ఉపయోగించారనే అంశంపై ఆరా తీయగా పురాతనమైన డాక్యుమెంట్లు లేదా ఇతర కీలక సమాచారాన్ని సీక్రెట్ గా చదివేందుకు వినియోగించినట్లు, దీంతో పాటు పురాతన కాలంలో చైనాకు చెందిన కోర్ట్ లలో న్యాయమూర్తులు నిందితుల్ని విచారించే సమయంలో వారి ముఖ కవళికలు గుర్తించకుండా ఉండేందుకు ఇలాంటి క్రిస్టల్ సన్ గ్లాసెస్ ను ఉపయోగించారు. వాటి ఆధారంగా 1752 లో జేమ్స్ ఐస్కాఫ్ అనే సైంటిస్ట్ సన్ గ్లాసెస్ ను తయారు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాతనే సన్ గ్లాసెస్ కు ప్రాముఖ్యత పెరిగింది.

Advertisement

Next Story

Most Viewed