- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయొద్దు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయొద్దని కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిరంజన్ కోరారు. గాంధీ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా ఉధృతి నేపథ్యంలో షెడ్యూల్ ను ప్రకటించొద్దని రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథిని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కేసులు పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు. 15 గంటల్లో ఒక్క గాంధీ ఆసుపత్రిలోనే 35 మంది కరోనాతో చనిపోయారని, ఇదీ కరోనా ఉధృతిని తెలియజేస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ప్రజలను, ఓటర్లను, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయొద్దని ఎన్నికల కమిషన్ ను కోరారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీష్ రెడ్డి అనుముల మండలం కొత్తపల్లిలో ఉద్యోగం కోసం అశోక్ రెడ్డి అని నిరుద్యోగి అడిగితే నిన్ను, నీ నాయకుడిని తొక్కేస్తా అని.. నీలాంటి నాయకులను చాలా మందిని చూశామని బెదిరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బెదిరింపులకు పాల్పడిన మంత్రి జగదీష్ రెడ్డిపై ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన హాలియా సమావేశంలో సీఎం కేసీఆర్ గిరిజన మహిళలను కుక్కలతో పోల్చారని ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను కోరారు.