తమిళనాడులో ఎవరు ముందు.. ఎవరు వెనుక..

by Shamantha N |
తమిళనాడులో ఎవరు ముందు.. ఎవరు వెనుక..
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికార అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతుండగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రెండు దఫాలుగా అధికారంలో కొనసాగిన అన్నాడీఎంకే పార్టీ ఈసారి ప్రతిపక్ష స్థానంతో సరిపెట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డీఎంకే పార్టీ అభ్యర్థులు అధికార ఏర్పాటే లక్ష్యంగా అన్ని స్థానాల్లోనూ మెజార్టీ కనబరుస్తారు. ప్రస్తుతం డీఎంకే 131 స్థానాల్లో అధిక్యం కనబరుస్తుండగా, అన్నాడీఎంకే 88 స్థానాల్లో, ఇతరులు ఒక్కస్థానంలో కొనసాగుతున్నారు.ఇదిలాఉండగా, తమిళనాట ఈసారి రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా కొందరు ముందంజలో ఉండగా, మరికొందరు వెనుకంజలో కొనసాగుతున్నారు.

ముందంజ : అన్నాడీఎంకే సీఎం పళని స్వామి(ఎడప్పాడి), పన్నీరు సెల్వం(బోడినాయక్కనూరు), డీఎంకే స్థాలిన్, మక్కల్ నిధి మయ్యమ్ కమల్ హాసన్ (కోయంబత్తూరు సౌత్)

వెనుకంజ : డీఎంకే అధినేత స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ (చెపాక్ నియోజకవర్గం), మాజీ ఎంపీ, సినీ నటి ఖుష్బూ (థౌజంట్ లైట్స్)

Advertisement

Next Story

Most Viewed