ఏసీబీ వలలో గద్వాల డీఎంహెచ్‌వో

by Shyam |   ( Updated:2020-07-23 06:06:34.0  )
ఏసీబీ వలలో గద్వాల డీఎంహెచ్‌వో
X

దిశ, వెబ్‌డెస్క్: జోగులాంబ గద్వాల జిల్లాలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గద్వాల డీఎంహెచ్‌వో కార్యాలయంలో గురువారం దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు డీఎంహెచ్‌వో భీమానాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వడ్డేపల్లి మండలంలో మెడికల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఏ.మంజుల కాకతీయ యూనివర్సిటిలో పీజీలో జాయినింగ్‌కు రిలీవింగ్ ఆర్డర్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే డబ్బులు ఇస్తేనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇస్తానని డీఎంహెచ్‌వో చెప్పడంతో ఆమె మహబూబ్‌నగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఈ క్రమంలో డీఎంహెచ్‌వో రూ.7వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

Advertisement

Next Story