- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వార్నింగ్ టు చర్చలు.. జూడాల డిమాండ్లు నేరవేరేనా..?
దిశ, వెబ్‌డెస్క్ : తమ న్యాయపరమైన డిమాండ్లను నేరవేర్చాలని జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. అయితే, కొవిడ్ నేపథ్యంలో అత్యవసర సేవలు మినహాయించి మిగతా విధులను మాత్రం జూడాలు బహిష్కరించారు. తమ డిమాండ్లను నేరవేర్చకపోతే రేపటి నుంచి అత్యవసర సేవలను (కొవిడ్, ఎమర్జెన్సీ) సేవలను కూడా బహిష్కరిస్తామని జూడాల సంఘం హెచ్చరించడంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చింది.
ప్రస్తుతం జూడాలతో డీఎంఈ రమేష్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. దీనికి ముందు జూడాలు సమ్మె విరమించాలని, లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇవ్వగా, ముఖ్యమంత్రి కేసీఆర్ విపత్కర సమయంలో సమ్మె నిర్ణయం సరైనది కాదని, అందరూ విధుల్లో చేరాలని జూడాలకు సూచించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రభుత్వం జూడాలతో చర్చలు జరుపుతుండటంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ చర్చలకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయకపోయినట్లయితే కొవిడ్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడటంతో పాటు వైద్యం అందక మరణాలు పెరిగే ఛాన్స్ ఉందని ప్రభుత్వం ముందుగానే భావించినట్లు తెలుస్తోంది.