- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం శోచనీయం
దిశ, మహబూబ్ నగర్ :
కరోనా పరీక్షలు విస్తృతంగా చేయాలని ఓ వైపు కేంద్రం, మరో వైపు ఉన్నత న్యాయస్థానం పదేపదే చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావట్లేదని మాజీ మంత్రి డీకే.అరుణ విమర్శించారు. ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చినా.. ప్రైవేటు ల్యాబ్‌లు కరోనా పరీక్షలు నిర్వహిస్తే ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదన్నారు. తగిన స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిలో అయితే పరిస్థితి మరి దయనీయంగా ఉందన్నారు. అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం ప్రభుత్వం చేతకానితనమే అని దయ్యబట్టారు.అదే సయమంలో తమకు రక్షణ లేదని జూనియర్ డాక్టర్లు రోడ్డెక్కడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు.ఎంతమందికైనా వైద్యం అందిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనలు అమలు కావడం లేదని, రోజురోజుకూ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కరోనా పరీక్షలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కరోనా బాధితులకు ప్రభుత్వం నాణ్యమైన వైద్యం అందించాలని డిమాండ్ ఆమె చేశారు.