- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్లుడిని ముందు పెట్టి నడిపిస్తున్నారు
దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై దాడి హేయమైన చర్య అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మంగళవారం కరీంనగర్లో నిరసన దీక్ష చేస్తున్న బండి సంజయ్‌ను డీకే అరుణ కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… అధికార దాహంతో బీజేపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. దుబ్బాక ఉపఎన్నికలో క్షేత్రస్థాయిలో బీజేపీ గెలుపు ఖాయమైనందునే టీఆర్ఎస్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
అల్లుడిని ముందు పెట్టి సీఎం కేసీఆర్ వెనుకుండి నడిపిస్తున్నారని డీకే అరుణ విమర్శించారు. టీఆర్ఎస్కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు రావని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఓటమి భయంతోనే ఇలాంటి అలజడులు రేపుతున్నారన్నారు. కేంద్రం మీద హరీష్ రావు ఏడవడం మాని.. రాష్ట్రానికి మీరేం ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీష్ రావుకు అబద్ధాల విషయంలో డాక్టరేట్లు ఇవ్వొచ్చన్నారు.