- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కుర్రాడి వల్లే మ్యాచ్ గెలిచా: జకోవిచ్
దిశ, స్పోర్ట్స్: రోలాండ్ గారోస్‌లో రెండో సారి ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన అనంతరం ఒక కుర్రాడికి నోవాక్ జకోవిచ్ తన రాకెట్ బహుమతిగా ఇవ్వడం టీవీల్లో చాలా మంది గమనించారు. అసలు ఆ కుర్రాడికి రాకెట్ ఇవ్వడమే కాకుండా కొద్ది సేపు ముచ్చటించాడు. అసలు ఎందుకు అలా చేశాడో మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జకోవిచ్ వెల్లడించాడు. ఆ కుర్రాడి వల్లే తాను విజేతగా నిలిచానని.. ఒక రకంగా ఆ అబ్బాయి తనకు కోచింగ్ ఇచ్చాడని జకోవిచ్ అన్నాడు.
‘తొలి రెండు సెట్లు కోల్పోయాక తాను కొంచెం డీలా పడ్డాను. కానీ మ్యాచ్ ఆరంభం నుంచి ఆ కుర్రాడు తనను ప్రోత్సహిస్తూ వచ్చాడు. ముఖ్యంగా నాకు కొన్ని వ్యూహాలు చెప్పాడు. సర్వీస్ నిలబెట్టుకోవాలని, తొలి బంతిని సులభంగా ఆడాలని.. ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాలని చెప్పాడు. సిట్సిపాస్‌కు బ్యాక్ హ్యాండ్ షాట్లు ఇవ్వమని పదే పదే చెప్పాడు. అతడు నాకు అలా కోచింగ్ ఇవ్వడం ముద్దుగా అనిపించింది. నాకు మద్దతు ఇవ్వడమే కాకుండా నాకు వ్యూహాలు కూడా చెప్పినందుకు కృతజ్ఞతగా రాకెట్ ఇచ్చాను.’ అని జకోవిచ్ వెల్లడించాడు. మ్యాచ్ అనంతరం రాకెట్ అందుకున్న కుర్రాడు చాలా సంతోషంగా ఎగిరి గంతేశాడు.