- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ పనులకు మాత్రమే ఇసుక సరఫరా..
దిశ, మహబూబ్ నగర్: ప్రభుత్వ పనుల కోసం ఇసుక సరఫరా చేయాలనే నిర్ణయానికి జిల్లాస్థాయి ఇసుక కమిటీ ఆమోదం తెలిపింది. సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అధ్యక్షతన జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో కేవలం ప్రభుత్వ పనులకు మాత్రమే ఇసుక సరఫరా గురించి తీసుకున్న నిర్ణయానికి ఆమోదం లభించింది. మహబూబ్ నగర్‌లో నీటి పారుదల శాఖ ద్వారా 24 చెక్ డ్యాముల నిర్మాణం అత్యవసరంగా చేపట్టవలసి ఉంది. దీంతో కొవిడ్ కారణంగా ఆగిపోయిన అభివృద్ధి పనులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ, మున్సిపల్ ఇంజినీరింగ్ తదితర శాఖల ద్వారా చేపట్టే ప్రభుత్వ పనులకు ఇసుక అవసరం ఏర్పడింది. ఈ పనులకు సంబంధిత తహశీల్దార్ ద్వారా అనుమతి తీసుకుని శాండ్ కమిటీ ఆమోదం తెలపడంతో మార్గం సుగమం అయింది. జిల్లాలోని అల్లిపూర్, వర్ని, లింగంపేట, నెక్కొండ చెక్ డ్యాముల నుంచి ఇసుక సరఫరాకు అనుమతిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా శాఖలు సీనరేజ్, డీఎఫ్ ఏంటి, ఎస్ఎంఎఫ్టీ చార్జీలు, వాహనానికి నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించి ఇసుక పొందాల్సి వస్తుందన్నారు.వర్షం వస్తే ఇసుక తరలింపునకు, పనులకు కూడా ఇబ్బంది ఏర్పడుతుందని, అందువల్ల వెంటనే ఇసుక లిఫ్టింగ్ ప్రారంభించాలన్నారు. నిర్దేశించిన ధరల ప్రకారం ఇసుకను కేటాయిస్తామని కలెక్టర్ చెప్పారు. ఇసుక సరఫరా చేసే వాహనాలకు ప్రభుత్వ పనుల వినియోగం నిమిత్తం అని ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఇసుక సరఫరా సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కలెక్టర్ పోలీస్ శాఖను కోరారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ సీతారామరావు, డీఆర్వో స్వర్ణలత, డీఎస్పీ శ్రీధర్, ఆర్డీవో శ్రీనివాస్, మైన్స్ ఎడీ మోహన్ లాల్, ఇంజినీరింగ్ అధికారులు హాజరయ్యారు.