- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుబంధు సాయాన్ని కాజేసిన అధికారి సస్పెన్షన్
by Shyam |
దిశ, వరంగల్: రైతులకు అందాల్సిన రైతుబంధు సాయాన్ని కాజేసిన మడికొండ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి రాధికను సస్పెండ్ చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మడికొండకు చెందిన పదిమంది రైతులకు చెందిన రైతుబంధు సాయం నిమిత్తం రూ.203361 డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయాల్సింది పోయి, రాధిక తన బంధువుల ఖాతాల్లో వేసింది. దీంతో బాధితులు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిసి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి ఉషా దయాళ్ అధికార దుర్వియోగానికి పాల్పడిందని నిర్ధారించారు. అనంతరం అధికారి రాధికను సస్పెండ్ చేసినట్టు ఆమె తెలిపారు.
Advertisement
Next Story