వలస కార్మికులకు మంత్రి బియ్యం పంపిణీ

by Shyam |   ( Updated:2020-04-02 09:25:46.0  )
వలస కార్మికులకు మంత్రి బియ్యం పంపిణీ
X

దిశ, మేడ్చల్: మేడ్చల్​ మున్సిపాలిటీలో 500 మంది నిరుపేదలకు మంత్రి మల్లారెడ్డి బియ్యం పంపిణీ చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో దాతలు ముందుకు రావాలని కోరారు. దాతల సహకారంతోనే పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలోని అన్ని పరిశ్రమలు లాక్​డౌన్​ను పాటిస్తున్న కారణంగా.. అక్కడ పనిచేసే కార్మికులకు అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బియ్యం పంపిణీకి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరినీ మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ దీపికా నర్సింహారెడ్డి, వైస్ ఛైర్మన్ రమేశ్​, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

tag: minister mallareddy, Distribution, rice, migrant workers, medchal

Advertisement

Next Story

Most Viewed