- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'తల్లి కన్నా మిన్నగా.. సీఎం జగన్ మేనమామ బాధ్యతలు'
దిశ, ఏపీ బ్యూరో: బిడ్డల భవిష్యత్ పట్ల తల్లిదండ్రుల కంటే మిన్నగా..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ బాధ్యతలు తీసుకుంటూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మహిళలు, బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమె సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేదరికంతో బాధపడుతున్న మహిళలు, బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
‘ఈ స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా మనం అందించే న్యాప్‌కిన్లు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల్లో చదువుతున్న బాలికలకు ఉచితంగా అందిస్తున్నాం. ఎడ్యుకేషన్, హెల్త్, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సాధారణంగా బాలికలకు 11వ సంవత్సరం నుంచి రుతుక్రమం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో వారికి వ్యక్తిగత శుభ్రత అన్నది చాలా అవసరం. ఇలాంటి సమయంలో తల్లి గైడ్ చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత శుభ్రత కోసం మన ప్రభుత్వం ఉచితంగా న్యాప్‌కిన్లు అందించే కార్యక్రమం ప్రారంభించడం చాలా గొప్ప విషయం. పిల్లల పట్ల తల్లి ఏరకంగా శ్రద్ధ తీసుకుంటుందో..ఆ విధంగా పిల్లల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రిగా ..తల్లి కంటే మిన్నగా ..ఒక మేనమామగా ఉచితంగా న్యాప్‌కిన్లు అందించాలని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం’ అని మంత్రి తానేటి వనిత కొనియాడారు. ‘ చాలా మంది పిల్లలు రుతుక్రమం సమయంలో స్కూళ్లకు వెళ్లకుండా, క్లాస్‌లు వినకుండా, చదువులపై శ్రద్ధ చూపకపోవడం, యాక్టివిటిస్‌లో ఉత్సాహంగా పాల్గొనలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితులను గ్రహించి.. సంతోషకరమైన, ఉత్సాహకరమైన వాతావరణం కల్పించేందుకు మన ప్రభుత్వం నుంచి బాలికలకు ఉచితంగా న్యాప్‌కిన్లు అందించాలని నిర్ణయించిందని మంత్రి తానేటి వనిత తెలియజేశారు.