ప్రొఫెసర్ అమరేషం రాజేశ్వర శర్మ మృతి

by karthikeya |   ( Updated:2024-09-16 06:13:45.0  )
ప్రొఫెసర్ అమరేషం రాజేశ్వర శర్మ మృతి
X

దిశ, సికింద్రాబాద్: తెలుగు సాహితీవేత్త, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ తెలుగు విభాగం అధ్యక్షులు ప్రొఫెసర్ అమరేషం రాజేశ్వర శర్మ ఆదివారం రాత్రి 11గంటలకు మరణించారు. మలకపేటలోని అయన నివాసం వద్ద పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. అయన మృతి పట్ల తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు, సెంట్రల్ సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులు డాక్టర్ నాగేశ్వరం శంకరం సంతాపం ప్రకటించారు. రాజేశ్వర శర్మ మరణం తెలుగు సాహితీ రంగానికి తీరని లోటుని పేర్కొన్నారు.

ప్రొఫెసర్ రాజేశ్వర శర్మ కామారెడ్డిలో 1930, మే 9వ తేదీన సరస్వతి రాజలింగ సభాపతి గార్లకు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ శాస్త్రం పూర్తిచేశాడు. తెలుగులో పీహెచ్‌డీ పట్టా కూడా అందుకున్నారు. ఆంధ్ర వ్యాకరణ వికాసం, నన్నె చోడుని కవిత్వం వంటి ఎన్నో గ్రంథాలు రచించారు. కామారెడ్డిలో ప్రాచ్య విద్యా పరిషత్ స్థాపించి అనేకమందికి విద్యా దానం చేశారు.

Advertisement

Next Story

Most Viewed