వీరి జీవితాలకు నో ‘సెక్యూరిటీ’..

by Shyam |
life of security guards
X

కొద్దిగా లావుపాటి శరీరం, బూడిదరంగు యూనిఫామ్, ముఖంలో కాసింత గాంభీర్యం, నింపుకుని అనుమతి లేనిదే చీమ అయినా లోనికి దూరనిచ్చేది లేదంటూ భీష్మించుకున్నట్టు కనిపించే పట్టు దల.. కోట్లాది ఆస్తులను, నిత్యం కంటికి రెప్పలా కాపాడుతూ ప్రాణాలనైనా ఫణంగా పెట్టి యజమానుల ధన,మాన, ప్రాణాలకు భద్రత నిచ్చే కాపలాదారులు చాలీచాలని వేతనాలతో బతుకు బండిలాగుతున్నారు.కంటికి రెప్పలా కాపాడే సెక్యూరిటీ మెన్ లకు జీవితాలు మాత్రం చాలా తక్కువ.పని చేసిన కంపెనీ ఇచ్చిన వేతనంలో ఉద్యోగం ఇచ్చిన సంస్థలే సగం తన్నుక పోతున్నాయి. సెక్యూరిటీ గార్డుల బతుకు పోరాటంపై దిశ ప్రత్యేక కథనం.

దిశ,గచ్చిబౌలి: దేశ నలుమూలల నుంచే కాకుండా నేపాల్ వంటి దేశాల నుంచి పొట్ట చేత పట్టుకుని నగరానికి వచ్చే సెక్యూరిటీ గార్డులు గుప్పెడు మెతుకుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఎక్కువ శాతం గ్రామీణ నవ యువకులు,రిటైర్ అయిన వారే ఈ ఉద్యోగాలు చేరుతుండటం గమనార్హం. గచ్చిబౌలి,మాదాపూర్, కొండా పూర్,హైటెక్ సిటీలలోని హోటల్,షాపింగ్ కాంప్లెక్స్లు, భవన సముదాయాలు, ఆస్పత్రులు,విద్యా సంస్థలు,వాణిజ్య కేంద్రాల్లో కనిపించే వందలాది మంది సెక్యూరిటీ గార్డులు జీవితాలను తరచి చూస్తే ఎన్నో ఆకలి కేకలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్‌లో పనిచేసే సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చాలా కుటుంబా ల కడుపు నింపుతుంది.ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఉద్యోగాల వేటలో తిరుగుతున్న వారి కంటే ఈ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు తొందరగా విజయం సాధిస్తున్నారు. బతుకు తెరువు కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వలస వచ్చిన చాలామంది యువకులు ఈ ఉద్యోగాల్లో చేరి పోతున్నారు.ఎందుకంటే ఈ ఉద్యోగాలకు ఉన్నత విద్య డిగ్రీలు అవసరం లేదు.కేవలం పదో తరగతి చది వి ఉండి దేహదారుఢ్యం,తెలివితేటలు ఉంటే చాలు. చాలా మంది యువకులు ఈ సెక్యూరిటీ ఉద్యోగా ల్లో స్థిరపడిపోయారు.

యువకులు,వృద్ధులే అధికం..

సెక్యూరిటీ ఉద్యోగుల్లో చాలామంది 20 నుంచి 25 సంవత్సరాలలోపు నవ యువకులు,50 ఏళ్లు దాటిన వృద్ధులు కూడా కనిపిస్తుంటారు.పోటీ ప్రపంచంలో తక్కువ చదువుకున్న వారికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉద్యోగం ఇదే కాబట్టి యువకులు దీనిలో చేరిపోతున్నారు.ఇక రిటైర్మెంట్ తర్వాత వయసుమళ్లిన వారు ఇంటి దగ్గర ఊరికే కూర్చోకుండా ఈ ఉద్యోగాల పై ఆసక్తి చూపిస్తున్నారు. అంతేగాక వచ్చిన ఆ కొద్ది డబ్బులు ఇంటి అవసరాలకు పనికొస్తాయి అని ఆలోచనలు దీనిలో చేరుతున్నట్టు చెబుతున్నారు.

వేతనాల్లో సగం దోపిడీ..

నగరంలో సుమారు 10 వేలకు పైగా సెక్యూరిటీ ఏజెన్సీలు ఉన్నాయి. బంజారాహిల్స్,జూబ్లీహిల్స్, మాదాపూర్,గచ్చిబౌలి,దిల్ సుఖ్ నగర్,విద్యా నగర్,తార్నాక, సనత్ నగర్, అమీర్ పేట్, ఆబిడ్స్ తదితర ప్రాంతాల్లో చాలా సెక్యూరిటీ ఏజెన్సీ లు ఉన్నాయి. ప్రస్తుతం చాలా కంపెనీలు ఉద్యోగ ప్రకటనలు ఇచ్చి అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకుకు ఆసక్తి చూపడం లేదు. అంతేగాక కంపెనీకి రక్షణగా ఉండేది కూడా పూర్తిగా బాధ్యత వహించే వ్యక్తులను ఎంపిక చేసుకోవడంలో తలెత్తే ఇబ్బందులను ఎదుర్కొనే సమయం లేకుండా కన్సల్టెంట్ లను ఆశ్రయిస్తున్నా రు.ఆయా కన్సల్టెంట్ సంస్థలకు తమకు అభ్యర్థుల సంఖ్యను చెబితే చా లు వెంటనే కావలసినంత మందిని అక్కడికి పంపిస్తున్నాయి.వారి జీత భత్యాలు,బాధ్యత,అంతా సంబంధిత కన్సల్టెన్సీ ల వారే చూసుకోవడం జరుగుతున్నది.నెల నెల వారి జీతభత్యాలు అన్నింటిని కన్సల్టెన్సీ ల వారికే సంస్థలు చెల్లిస్తున్నాయి.వీటిలో నుంచి అభ్యర్థులకు జీతభత్యాలను సమర్పిస్తారు. దీన్నిబట్టి రక్షణగా ఉండటం మినహా ఈ సెక్యూరిటీ మెన్ లకు కంపెనీతో ప్రత్యక్షంగా ఎటువంటి సంబంధం ఉండదని స్పష్టం అవుతోంది. తాము పనిచేస్తున్న కంపెనీ అసలు తమకు ఎంత జీత భత్యం చెల్లిస్తుందని విషయం వారికి తెలియక పోవడం గమనార్హం. దీనివల్ల వీరి జీతభత్యాలు చాలావరకు సంబంధిత సెక్యూరిటీ సంస్థలు నొక్కేస్తున్నాయని పలువురు సెక్యూరిటీ ఉద్యోగు లు వాపోతున్నారు.

Advertisement

Next Story