- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ ఎఫెక్ట్.. పిల్లల చదువుకు ఆర్థిక సాయం చేస్తామని హామీ
దిశ, పరిగి : ఆసరా కోల్పోయిన అభాగ్యులకు అండగా నిలిచి ఆదుకుంటే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ‘దిశ’ దిన పత్రికలో గురువారం ప్రచురితమైన ‘దిక్కెవరు..?’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ స్పందించారు. కుల్కచర్ల మండల పరిధిలోని బండవేల్కిచెర్ల గ్రామంలో కరోనా బారిన పడి చాకలి మల్లేష్ అనే వ్యక్తి మృతి చెందడంతో భార్య, పిల్లలు ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోయారు.
ఈ నేపథ్యంలో మానవతా ధృక్పథంతో కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గురువారం బండెవేల్కిచెర్లకు వెళ్లారు. చాకలి మల్లేష్ భార్య శివలీలకు రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. అనాధలుగా మిగిలిన పిల్లల చదువుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆర్థిక సహాయం అందజేత కార్యక్రమంలో కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డితోపాటు బండవేల్కిచెర్ల సర్పంచ్ శిరీషా లక్ష్మీరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా శరత్ కుమార్ రెడ్డికి సర్పంచ్ కృతజ్ఞతలు తెలియజేశారు.