నేపాల్ లో భారత దేశ టీవి ప్రసారాల నిలిపివేత

by Shamantha N |
నేపాల్ లో భారత దేశ టీవి ప్రసారాల నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్: చైనా దొడ్డిదారిన మరో కుట్రకు తెర లేపింది. ఇప్పటికే భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ కు సాయం అందిస్తున్న చైనా.. అదే దారిలో నేపాల్ ను కలుపుకునిపోతూ రెండు దేశాల మధ్య కొత్త సమస్యలను సృష్టిస్తోంది. తాజాగా చైనా తనకు అండగా ఉందన్న గర్వంతో నేపాల్.. భారత్ కు చెందిన టీవీ ఛానళ్లను నిలుపుదల చేసినట్లు ఆ దేశ కేబుల్ ఆపరేటర్లు ప్రకటించారు.

భారత్ కు చెందిన న్యూస్ ఛానల్స్ నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మకు వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేస్తున్నాయని, అలాంటి వాటిని నిషేధించాలని ఆ దేశ డిప్యూటీ ప్రధాని, అధికార పార్టీ ప్రతినిధి నారాయణ కాజీ శ్రేష్ఠ గురువారం ఉదయమే ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్లు భారత్ కు చెందిన టీవీ ప్రసారాలను నిషేధించినట్లు తెలిస్తోంది.

కాగా టీవీ ప్రసారాల నిలుపుదలపై నేపాల్ ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ కేబుల్ ఆపరేటర్లు మాత్రం తామే స్వచ్ఛందంగా టెలికాస్ట్ ను ఆపేశామని ప్రకటించారు. భారత్ కుచెందిన దూరదర్శన్ ఛానల్ మినహా మరే ప్రసారాన్ని చేయమని పేర్కొన్నారు. మా నిర్ణయం వెనక ఎవరు లేరని, తామే స్వచ్ఛంగా నిలిపివేశామని తెలిపారు. అధికార పార్టీ నేత ప్రకటించిన గంటల వ్యవధిలోనే భారత ఛానళ్లను నిలిపివేయడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed