వాట్సాప్‌లో అదృశ్యమయ్యే మెసేజ్ ఫీచర్

by Harish |
వాట్సాప్‌లో అదృశ్యమయ్యే మెసేజ్ ఫీచర్
X

దిశ, వెబ్‌డెస్క్: వినియోగదారులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న కొత్త ఫీచర్ ఒకటి వాట్సాప్‌కు వచ్చేస్తోంది. పంపిన మెసేజ్‌లను ఇప్పటివరకు గంటలోగా అందరికీ డిలీట్ చేసే ఫీచర్ ఉంది కానీ, గంట సమయం దాటిన తర్వాత దాన్ని డిలీట్ చేయడం కుదరదు. దీని వల్ల సీక్రెట్ చాట్ చేసుకునేవాళ్లకు ఇబ్బందిగా ఉండేది. అందుకే అలా ఇబ్బంది పడే వారికోసం వాట్సాప్ కొత్తగా అదృశ్యమయ్యే మెసేజ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను వాట్సాప్ విడుదల చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఫీచర్ ద్వారా ఎవరికైనా పంపిన మెసేజ్‌లను ఏడు రోజుల తర్వాత వాటంతట అవే డిలీట్ అయ్యేలా సెట్ చేయవచ్చు. అందుకోసం వాట్సాప్ చాట్ ఓపెన్ చేసి, కాంటాక్ట్ పేరు లేదా గ్రూప్ పేరు మీద ట్యాప్ చేసి, డిజప్పియరింగ్ మెసేజ్ ఆప్షన్‌ను ఆన్ చేస్తే సరిపోతుంది. ఈ ఫీచర్‌ను ఆన్ చేసిన తర్వాత పంపిన మెసేజ్‌లు అన్నీ ఏడు రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి. ఈ ఫీచర్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఎంతసేపు ఆన్‌లో ఉండాలని కూడా సెట్ చేయవచ్చు. గ్రూప్‌లకు కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

Advertisement

Next Story

Most Viewed