- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు మీద మురుగు నీరు.. నానా అవస్థలు పడుతున్న జనం
దిశ, బూర్గంపాడు: బూర్గంపాడు మండలం లక్ష్మీపురం నుండి నకిరిపేట, టేకుల చెరువు గ్రామాలకు వెళ్లే రహదారిపై గుంటలు పడి అధ్వానంగా తయారైంది. ఈ రహదారి వెంట ఐటీసీ కర్మాగారానికి సంబంధించిన అనుబంధ గోదాములు ఉన్నాయి. ఈ గోదాములకు నిత్యం వందల సంఖ్యలో భారీ వాహనాలు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి. ఈ వాహనాల రాకపోకల వల్లే ఈ దారి ఇంత అధ్వానంగా తయారైందని గ్రామస్తులు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే ప్రజలు ఈ రహదారి నుంచే పొలాలకు, ఇతర పనులకు, పట్టణాలకు వెళ్తుంటారు. అలాగే ఈ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఐటీసీ ముడి సరుకు నిల్వ ఉంచే గోదాములు ఉండటం వల్ల వాటికి సరైన డ్రైనేజీలు లేకపోవడంతో రోడ్డు మీదకు నీరు వచ్చి చేరడంతో రోడ్డు అంతా బురదమయం అవుతుంది. దీంతో రోడ్డు పూర్తిగా గుంటలు పడి నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గోదాముల యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల రోడ్డుపై మురుగునీరుతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, ఐటీసీ అధికారులు స్పందించి రోడ్డు పునర్నిర్మాణం చేసే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.