'మైదానం' కోసం ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్

by Shyam |
మైదానం కోసం ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ డైరెక్టర్ యంగ్ డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల‌ ప్రస్తుతం నిర్మాతగా మారారు. ‘మైదానం’ వెబ్ సిరీస్‌కు ఆయనే నిర్మాత. తెలుగు ఓటీటీ యాప్ ‘ఆహా’ కోసం ఈ వెబ్ సిరీస్ రూపొందించ‌బోతున్న‌ట్లు తెలిసింది. అయితే ‘నీది నాది ఒకే క‌థ సినిమా’తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న డైరెక్టర్ వేణు ఊడుగుల‌, ప్రస్తుతం రానా ద‌గ్గుబాటితో ‘విరాట ప‌ర్వం’ తెర‌కెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ప్ర‌స్తుతం డిజిట‌ల్ మీడియాకే ప్రాధాన్య‌త ఎక్కువ పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రేక్షకులు ఓటీటీల‌పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి ఇంట్రెస్టింగ్ న‌వ‌ల‌లు, సీరియ‌ల్స్‌ ను తెరకెక్కిస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ ‘మైదానం’ న‌వ‌ల‌ వెబ్ సిరీస్ రూపంలో తెర‌కెక్కిస్తున్నారు.

Advertisement

Next Story