- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాసుకున్న ప్రతీ మాట మీ వాయిస్‌లోనే వినిపిస్తుంది : సుకుమార్
దిశ, వెబ్‌డెస్క్: గాన గంధర్వుడు బాలుకు అక్షర నివాళులు అర్పించారు దర్శకుడు సుకుమార్. ‘అదేంటో సార్.. రాసుకున్న ప్రతీ మాట మీ వాయిస్‌లోనే వినిపిస్తుంది. ఒక్క మాటేంటి ప్రతీ వాక్యం, కథ, నవల ఏదైనా సరే.. వాటి గొంతు మాత్రం మీదే! అంతలా మాలో అంతర్భాగం అయిపోయిన మీ గాత్రం వింటూ.. గాన మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ.. దాని గురించి చర్చించుకుంటూ ఇన్ని రోజులు, సంవత్సరాలు బతికేశాం.. బతికేస్తాం. ఆ రోజులన్నీ మీవే కదా.. మీరు మాతో జీవించనవే కదా. అంటే ఒక్కరోజే కొన్ని కోట్ల రోజులు జీవించిన గొప్పతనం మీది.. అలాంటప్పుడు మీకు మరణం ఏంటి సార్.. అంటూ హార్ట్ ఫెల్ట్ నోట్ పెట్టారు.
‘పాపం మరణం పిచ్చిది బాలు సార్.. ఇలా వచ్చి అలా మిమ్మల్ని తీసుకెళ్ళిపోవచ్చు అనుకుంది. కానీ ఎక్కడ చూసినా మీరే.. ఎక్కడ విన్నా మీ పాటే కనిపించడంతో బిత్తరపోయింది. దానికి ముందు తెలియదు, మిమ్మల్ని తీసుకెళ్ళడం అంటే భూమండలాన్ని మోసుకెళ్ళడం అని.. అందుకే ఇప్పుడు మరణం ఒంటరై బిత్తర చూపులు చూస్తోంది. దిక్కుతోచక బోరున ఏడుస్తోంది.. దానికి కూడా మళ్లీ మీ పాటే ఓదార్పు. పోనీలెండి సార్.. ఈసారి దాన్ని క్షమించండి.. ఇంకోసారి రాదులెండి’ అంటూ.. కన్నీటి వీడ్కోలు పలికారు సుకుమార్.