ABCD మూవీ డైరక్టర్‌కు హార్ట్ అటాక్..

by Anukaran |   ( Updated:2020-12-12 03:43:58.0  )
ABCD మూవీ డైరక్టర్‌కు హార్ట్ అటాక్..
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ బాలీవుడ్ డైరక్టర్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారు. 46 ఏళ్ల వయస్సులో హార్ట్ అటాక్ రావడంతో ఆయన్ను ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ప్రమాదం ఏమీ లేదని వైద్యులు వెల్లడించినట్లు రెమో భార్య లెజిల్లె డి సౌజా ఓ ఆంగ్ల మీడియాకు వివరించారు.

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే వాల్ ఒకటి బ్లాక్ అయ్యిందని, యాంజియోగ్రఫీ ట్రీట్‌మెంట్ ద్వారా దానిని సరిచేసినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రెమో డి సౌజా తొలుత బాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా పనిచేయగా ఈ మధ్యకాలంలో డైరక్టర్‌గా కూడా రాణిస్తున్నారు. ఈయన ఏబీసీడీ, స్ట్రీట్ డాన్సర్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.

Advertisement

Next Story

Most Viewed