వోడ్కా తాగి రెచ్చిపోయిన వర్మ.. కూతురు వయసున్న అమ్మాయితో అసభ్యంగా..

by Shyam |   ( Updated:2021-08-20 23:36:10.0  )
వోడ్కా తాగి రెచ్చిపోయిన వర్మ.. కూతురు వయసున్న అమ్మాయితో అసభ్యంగా..
X

దిశ, వెబ్‌డెస్క్: తింటే గారెలే తినాలి.. వింటే భారతమే వినాలి అని పెద్దలు అంటుంటారు. ప్రస్తుతం ఈ సామెతకు ఇంకొక లైన్ ని యాడ్ చేస్తున్నారు నెటిజన్లు. “తింటే గారెలే తినాలి.. వింటే భారతమే వినాలి.. బతికితే వర్మలానే బతకాలి” అంటూ కామెంట్లు పెడుతున్నారు. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సినపనే లేదు. ఆయన తీసే సినిమాలు, చేసే చేష్ట‌లు అన్నీ కూడా వివాదాల‌తో ముడిప‌డి సంచలనాన్ని సృష్టించినవే. ఇక వర్మ, మహిళలతో ప్రవర్తించే తీరు ఎన్నో విమర్శలకు దారితీస్తూ ఉంటుంది. మియా మాల్కోవా మొదలుకొని నిన్న మొన్న వచ్చిన బుల్లితెర యాంకర్ల వరకు ఆయన చేసిన రచ్చ మామూలుది కాదు. ఇక తాజాగా తన కూతురు వయసున్న అమ్మాయి బర్త్ డే వేడుకల్లో వర్మ వేసిన వెకిలి వేషాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

ఒక బర్త్ డే వేడుకల్లో రామ్ గోపాల్ వర్మ రెచ్చిపోయాడు. అమ్మాయిలను అసభ్యంగా తాకుతూ వారిని విసిగించాడు. మద్యం మత్తులో బర్త్ డే జరుపుకుంటున్న అమ్మాయిపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ కనిపించాడు. కేక్ తినిపిస్తూ.. హాగ్ చేసుకొని ముద్దులు ఇస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ బర్త్ డే వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వేడుకల్లో నటి జ్యోతి, శ్రీకాంత్ అయ్యంగార్ క్లాప్స్ కొడుతూ కనిపించారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రోజురోజుకు వర్మ ఆగడాలు ఎక్కువైపోతున్నాయని, కూతురు వయసున్న అమ్మాయితో ఏంటా వెకిలి చేష్టలు అంటూ మండిపడుతున్నారు. మరికొంతమంది అయితే.. ఏదైమైనా బతికితే వర్మలా బ్రతకాలిరా అంటూ ఎత్తేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed