- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంచరపాలెం డైరెక్టర్.. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ!
‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో సినీ పరిశ్రమను తనవైపు తిప్పుకున్న దర్శకుడు వెంకటేశ్ మహా. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న మహా.. రెండో సినిమాకు కూడా అదే పేరును నిలబెట్టుకున్నాడు. సత్యదేవ్ హీరోగా ఇటీవలే ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి కూడా మంచి స్పందన లభించింది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు మహా.
తొలి రెండు చిత్రాలను పల్లెటూరు నేపథ్యంలో సహజత్వానికి దగ్గరగా తీసన మహా.. లేటెస్ట్ ప్రాజెక్ట్ కోసం ఏకంగా అమెరికాకు పయనమవుతున్నాడు. ఈ క్రమంలోనే తన మూడో సినిమా ‘సుమతి’ టైటిల్‌ను ప్రకటించాడు. ‘ఎంపైర్ స్టేట్ ఆఫ్ మైండ్’ అని ఆ సినిమాకు క్యాప్షన్ కూడా ఇచ్చాడు. న్యూయార్క్‌లోని ప్రముఖ ఎంపైర్ స్టేట్ ముందు ఒక వృద్ద మహిళ నిల్చొని ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ మహిళ ఎంపైర్ స్టేట్‌కు ఎందుకు వెళ్లింది? వెళ్లాక అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? అనే కోణంలో కథ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఎక్కువ శాతం అమెరికా బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుందని టాక్. ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రంలో వేశ్య పాత్రలో నటించడంతో పాటు ఆ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించిన ప్రవీణ పరుచూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కాగా, ఈ సినిమాను తన పేరెంట్స్ ‘పరుచూరి గోపాలకృష్ణ, విజయలక్ష్మీ, గడ్డిగోపుల వెంకటరత్నం, సుమతి దేవి’లకు అంకితమిస్తున్నట్లు ప్రవీణ తెలిపింది. అయితే, మెయిన్ రోల్‌ను పోషిస్తున్న నటితో పాటు ఈ చిత్రంలోని ఇతర పాత్రధారుల వివరాలేవీ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఆ విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.