కొత్త జీవితాన్ని ప్రారంభించిన దిల్ రాజ్.. విష్ చేసిన కూతురు

by Jakkula Samataha |   ( Updated:2023-12-17 15:07:53.0  )
కొత్త జీవితాన్ని ప్రారంభించిన దిల్ రాజ్.. విష్ చేసిన కూతురు
X

నిర్మాత దిల్ రాజు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తన సతీమణి అనిత మరణించడంతో మూడేళ్లుగా ఒంటరిగా ఉంటున్న దిల్ రాజు.. తన లైఫ్ లో మరో అమ్మాయికి చోటిస్తూ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం రాత్రి నిజామాబాద్ లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం జరగ్గా.. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కూతురు హన్షితా రెడ్డి బలవంతం మీద పెళ్లి చేసుకున్న దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలిపింది కూతురు. అన్ని సమయాల్లో అండగా నిలిచిన నీకు ధన్యవాదాలు నాన్న.. మన కుటుంబ సంక్షేమం నీకు ఎంత సంతోషాన్ని ఇస్తుంది నాకు తెలుసు.. కానీ నీ సంతోషం నాకు ముఖ్యం.. కొత్తగా పెళ్లి చేసుకున్న మీరిద్దరూ మరింత సంతోషంగా జీవించాలని కోరుకున్నట్లు తెలిపింది. లవ్ యూ డాడీ.. నీకు ప్రతీ రోజు చాలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ హన్షిత రెడ్డి తండ్రికి విష్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed