- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిజిటల్ సర్వే డల్.. సీఎం ఆదేశించినా.. రిపోర్టు పంపని కలెక్టర్లు
దిశ, తెలంగాణ బ్యూరో: ‘రాష్ట్రంలో వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలి. ముందుగా ఈ నెల 11వ తేదీ నుంచి పైలెట్ డిజిటల్ సర్వేను చేపట్టాలి. అందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలి. అందులో మూడు గ్రామాలను గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఉండాలి. మిగతా 24 గ్రామాలను ఇరవై నాలుగు జిల్లాల నుంచి ఎంపిక చేయాలి’.. సీఎం కేసీఆర్. డిజిటల్ సర్వే నిర్వహణ అంశంపై ప్రగతి భవన్ లో ఈ నెల 2వ తేదీన సమావేశంలో అధికారులను ఆదేశించారు.
కానీ డిజిటల్సర్వే అంశంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇంకనూ గ్రామాల ఎంపిక జరుగలేదు. ఏయే గ్రామాల్లో ఏ ఎజెన్సీ ద్వారా చేయించాలన్న దానిపైనా క్లారిటీ రాలేదని తెలిసింది. కలెక్టర్లు కూడా ఏ గ్రామంలో డిజిటల్సర్వేను పైలెట్‌ప్రాజెక్టుగా చేపట్టాలో ప్రభుత్వానికి రిపోర్టు పంపలేదు. ఐతే తహసీల్దార్లు, ఆర్డీఓలు మాత్రం ఏ గ్రామంలో చేపడితే బాగుంటుందన్న విషయంపై కలెక్టర్లతో చర్చించారు.. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 27 గ్రామాల జాబితా మాత్రం రూపొందించలేదు. ఏ ప్రాతిపదికన డిజిటల్సర్వే చేపడుతారు? ఏయే అధికారికి ఎలాంటి బాధ్యతలు ఉంటాయన్న విషయంపైనా ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి రాలేదని సమాచారం. సర్వే అండ్ల్యాండ్రికార్డుల శాఖలో మాత్రం ఎజెన్సీల ఎంపిక ప్రక్రియపై కసరత్తు చేసింది. 29 కంపెనీలు కూడా డిజిటల్సర్వే చేసేందుకు ముందుకొచ్చాయి. వాటి ఎంపిక ప్రక్రియను పెండింగులోనే ఉంచారు. దానికి తోడు విధివిధానాలపై చర్చించలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
భూ తగాదాలు లేని భవిష్య తెలంగాణను నిర్మించే లక్ష్యంలో భాగంగా డిజిటల్ సర్వే చేయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేసి, వాటికి అక్షాంశ రేఖాంశాలను( కో ఆర్డినేట్స్) గుర్తించి పట్టాదారుల భూములకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. ప్రజల భూమి హక్కులను కాపాడాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా చేపట్టిన డిజిటల్ సర్వేను సమర్ధవంతంగా నిర్వహించి ప్రభుత్వ సదుద్దేశ్యాన్ని అర్థం చేసుకొని రైతులకు సేవ చేసే లక్ష్యంతో సర్వే నిర్వహించాలన్నారు. ఒక్కో గ్రామాన్ని సర్వే చేసేందుకు 15 రోజులుగా నిర్ణయించారు. సీఎం కేసీఆర్నిర్దేశించిన షెడ్యూల్‌ప్రకారమే మొదలు పెడితే ఈ పాటికే పైలెట్‌ప్రాజెక్టు పూర్తయ్యేది. మరి ఏ కారణం చేత సర్వేకు బ్రేకులు పడ్డాయో అధికారులు చెప్పడం లేదు. ఏ అధికారిని అడిగినా అంతా పెద్దవాళ్లకే తెలుసునంటూ తప్పించుకుంటుండడం గమనార్హం. ఇంకా ఎవాల్యూయేషన్టెక్నికల్టీం కసరత్తు దగ్గరే ఆగిపోయిందంటున్నారు.
రాజకీయ పరిస్థితులే కారణమా?
రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో డిజిటల్భూ సర్వే తలపెడితే పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయేమోనన్న చర్చ అధికార వర్గాల్లోనూ నెలకొంది. ఇదే విషయాన్ని కొందరు అధికారులు పాలకపక్షానికి చేరవేసినట్లుగా చర్చ నడుస్తోంది. చాలా ప్రాంతాల్లో వివాదాలు నెలకొన్నాయి. అలాంటి అంశాల జోలికి ఇప్పుడు వెళ్లడం అంత మంచిది కాదన్న సూచనలు అందినట్లు తెలుస్తోంది. సర్వే ప్రక్రియను షురూ చేస్తే తలెత్తే భూ వివాదాలను పరిష్కరించే మెకానిజం అవసరం. అవి పెద్ద స్థాయిలో తలెత్తితే ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసే అవకాశం ప్రతిపక్షాలకు లభించే అవకాశం ఉంది. అందుకే కొంత కాలం డిజిటల్సర్వే ప్రక్రియను నిలిపివేసేటట్లుగా ఉన్నారని రెవెన్యూ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 46 లక్షల సర్వే నంబర్లకు గాను 5 లక్షలకు పైగా టిప్పన్లు లేవని ఓ సర్వే అధికారి చెప్పారు. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ, మంఖాల్, రావిర్యాల, కొంగరకుర్దు, యాదాద్రి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలంలోని కొన్ని గ్రామాల్లో టిప్పన్లు లేవు. ఖరీదైన భూములు కలిగిన గ్రామాల్లోనే భూములన్నింటికీ టిప్పన్లు లేనప్పుడు సరిహద్దు వివాదాలను పరిష్కరించడం అంతా సులువైన ప్రక్రియ కాదన్నారు.
ఇవి అనివార్యం
ప్రతి గ్రామ రగ్బీ(మొత్తం విస్తీర్ణంతో కూడిన వివరాలు) ఒరిజినల్రిజిస్టర్, టిప్పన్లు ఉంటేనే సర్వే సాధ్యం. కొన్ని ప్రాంతాల్లో తొవ్వలకు, గౌటాన్, చెరాయ్ వంటి భూములకు సర్వే నంబర్లు ఇవ్వలేదు. ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలి గ్రామాల్లో కనీసం 30 శాతం సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. సర్వే చేసి సెటిల్మెంట్చేయకపోతే వృథా. సర్వే నంబర్ల ప్రకారం క్షేత్ర స్థాయిలో సాగు చేసుకుంటున్న రైతులకు ఎలాంటి ప్రమాదం లేదు. కానీ అలాంటి పరిస్థితులు కనిపించడం లేదని ప్రాథమిక అంచనా. పట్టాదారు పాసు పుస్తకాల్లోని విస్తీర్ణానికి, క్షేత్ర స్థాయి సర్వే నంబర్లకు మధ్య అంతులేని తేడాలు ఉన్నాయి. ఇరుగుపొరుగు రైతులందరూ సానుకూలతను వ్యక్తం చేస్తే తప్ప సర్వే ముందుకు సాగదంటున్నారు. సర్వేతో పాటు సెటిల్మెంట్చేయగల రాజ్యాంగబద్ధత కలిగిన అధికారులు పని చేయాలి. అప్పుడే వివాదాల్లేని సర్వే సాధ్యమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐతే ఏ విధానాన్ని అనుసరించి సర్వే చేయాలో తేల్చలేదు.
కో ఆర్డినేట్స్ తోనే అంటే..?
ప్రతి రైతు తన స్వాధీనంలోని భూమికి మాత్రమే కో ఆర్డినేట్స్గీసి ఇచ్చే పరిస్థితి మాత్రమే సాధ్యమవుతుంది. అది కూడా సరిహద్దులు తేలితేనే కుదురుతుంది. పట్టాదారు పాసు పుస్తకంలోని విస్తీర్ణానికి సరిపడా భూమి తేలితేనే రైతు ఒప్పుకుంటాడు. ఏ మాత్రం తగ్గినా తన భూమిని చూపించాలని డిమాండ్‌చేసే అవకాశం ఉంటుంది. దాంతో సర్వే నంబర్ల వారీగా విస్తీర్ణాన్ని కొలవడం అనివార్యంగా మారనుంది. ప్రతి గ్రామంలోనూ సర్వే నంబర్లలో సబ్ డివిజన్లు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కో సర్వే నంబరు వందల భాగాలుగా విడిపోయింది. రికార్డుల్లో బాగానే కనిపిస్తున్నాయి. కానీ క్షేత్ర స్థాయిలోనే హద్దు రాళ్లు ఉన్నాయో లేవోనన్న అనుమానాలు ఉన్నాయి. సర్వే పనులు మొదలు పెడితే తప్ప హద్దుల పంచాయితీ మొదలు కాదు. పైగా రైతు అనుభవిస్తున్న భూమికి అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన కో ఆర్డినేట్స్ ను నిర్దేశించడం సాంకేతికంగా పెద్ద కష్టమైన పనేం కాదు. ఏ మాత్రం మొబైల్యాప్స్ఉపయోగించగలిగే అవగాహన ఉన్నా సొంతంగా చేసుకునే వీలుందని సర్వే సిబ్బంది చెబుతున్నారు. అయితే ప్రభుత్వం కేటాయించిన రూ.400 కోట్లు ఎలా ఖర్చు పెడతారో వేచి చూడాలని రెవెన్యూ నిపుణులు అంటున్నారు.