- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
3.5 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా డిజిట్ ఇన్సూరెన్స్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సాధారణ బీమా సంస్థ డిజిట్ ఇన్సూరెన్స్ 200 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 1,500 కోట్ల) నిధులను సమీకరిస్తోంది. హెల్త్, కార్, బైక్, ట్రావెల్ బీమాలను అందిస్తున్న డిజిట్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రస్తుత ఇన్వెస్టర్ ఫేరింగ్ కేపిటల్‌తో పాటు కొత్త పెట్టుబడిదారులైన సీక్వోయా కేపిటల్ ఇండియా, ఐఐఎఫ్ఎల్, మరికొందరి నుంచి ఈ నిధులను అందుకోనుంది. ఈ నిధుల సమీకరణ బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఆమోదానికి లోబడి ఉంటుందని కంపెనీ తెలిపింది. దీని ద్వారా భారత బీమా పరిశ్రమలో అతిపెద్ద నిధుల సమీకరణగా ఇది నిలుస్తుందని, అంతేకాకుండా డిజిట్ ఇన్సూరెన్స్ మొత్తం మూలధనం సుమారు రూ. 3,300 కోట్లకు, కంపెనీ విలువ 3.5 బిలియన్ డాలర్ల(రూ. 26 వేల కోట్ల)కు చేరుకోనున్నట్టు కంపెనీ పేర్కొంది.
డిజిట్ ఇన్సూరెన్స్ సంస్థ 2017లో ప్రారంభమైన తర్వాత ఈ ఏడాది యూనికార్న్ సంస్థగా మారింది. కేవలం 4 ఏళ్లలో ఈ గుర్తింపు సాధించడం గమనార్హం. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో గతేడాది మొత్తం పరిశ్రమ 5 శాతం వృద్ధి సాధిస్తే, డిజిట్ ఇన్సూరెన్స్ సంస్థ 44 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే, సంస్థ మొత్తం 2 కోట్లకు పైన వినియోగదారులను కలిగి ఉంది. 4 లక్షలకు పైగా క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసింది. ‘ఫేరింగ్ కేపిటల్, కొత్త పెట్టుబడిదారుల మద్దతు మాకెంతో కీలకం. టెక్నాలజీ వినియోగం ద్వారా మరింత మందికి బీమా అందిస్తాం, బీమా ప్రక్రియను మరింత సరళీకృతం చేస్తామని’ డిజిట్ ఇన్సూరెన్స్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కామేష్ గోయెల్ చెప్పారు.