‘సర్వేకు వెళ్లనన్నా వినలేదు.. ఇప్పడు నాకు కరోనా వచ్చింది.. మాకు దిక్కెవరు’

by Anukaran |   ( Updated:2023-12-15 16:40:31.0  )
‘సర్వేకు వెళ్లనన్నా వినలేదు.. ఇప్పడు నాకు కరోనా వచ్చింది.. మాకు దిక్కెవరు’
X

దిశ, ఖమ్మం టౌన్: అనుకున్నంత అయింది జ్వరం సర్వే ఆర్పీల పాలిట శాపంగా మారింది. ఖమ్మం నగరంలో మెప్మా (పేదరిక నిర్ములన జీవనోపాదుల సంస్థ) లో పనిచేస్తున్న ఆర్పీ లు ఇప్పుడు బతుకు పోరాటం చేయక తప్పడం లేదు. ఉన్నతాధికారులు వేసిన డ్యూటీలకు వారు బలయ్యే పరిస్థితి వచ్చింది. వారు ఎంత చెపుతున్నా పట్టించుకోని అధికారులు జ్వరం సర్వే చేయమంటూ ఆదేశించడంతో వారు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. నగరంలోని 55వ డివిజన్‌కు సంబంధించిన ఆర్పీ గోపిక కుమారి రెండు రోజుల క్రితం కొవిడ్ పాజిటివ్ వచ్చింది.

తనతో పాటు భర్త కు కూడా రావడం ఆమె ఆవేదనతో జిల్లా మిషన్ కోఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు మెప్మా కార్యాలయం వాట్సాప్ గ్రూపులో తన ఆవేదనను తెలియజేస్తూ ఆడియో పెట్టింది. అధికారులకు తను ముందుగానే చెప్పినా వినలేదని ఇప్పుడు తనతోపాటు భర్తకు కొవిడ్ వచ్చిందని, ఇప్పుడు తమకు దిక్కు ఎవరని అధికారులను ప్రశ్నించింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆర్పీల పట్ల సానుభూతి చూపాలని ఆమె కోరింది.

Advertisement

Next Story