- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టార్గెట్ బీజేపీ.. గులాబీ కొత్త ఎత్తుగడ
దిశ ప్రతినిధి, హైదరాబాద్: టీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లను టార్గెట్ చేసిందా..? అనర్హత వేటు కోసం ఎత్తుగడలు మొదలుపెట్టిందా..? అంటే జరుగుతున్న పరిణామాలు నిజమనే అనిపిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లను ఇబ్బందుల పాలుజేసేందుకు టీఆర్ఎస్ తప్పులు వెతుకుతోంది. ఎన్నికల్లో సమర్పించిన వివరాల్లో తప్పులేం దొరుకుతాయని వెతుకులాడే పనిలో పడింది. ఏ చిన్న కారణం దొరికినా వదలొద్దన్న అధిష్టానం ఆదేశాల మేరకు కేసులు పెడుతున్నట్లు సమాచారం.
ప్రధానంగా నామినేషన్‌పత్రాలు, అఫిడవిట్‌లో లోపాలు ఏం ఉన్నాయో వాటినే లక్ష్యంగా చేసుకొని కేసులు దాఖలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మహా నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ కార్పొరేటర్లకు గెలిచామన్న సంతోషం దూరమైంది. తాము ఐదేళ్ల పాటు పదవిలో ఉంటామో, ఊడుతామో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి విధులకు ఆటంకం కలిగించారన్న కేసు ఉంది. ఇటీవల షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బంది విధులను ఆటంకపర్చినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్త పురపాలక చట్టం పరిధిలో ఈ అంశాన్ని ఏ కోణంలో చూడాలో బీజేపీ కూడా యోచిస్తుందని సమాచారం.
టార్గెట్ బీజేపీ..?
గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లలో గెలువు బావుటా ఎగురవేసిన బీజేపీ కార్పొరేటర్లను టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు టార్గెట్ చేశాయి. సుమారు రెండు నెలల క్రితం జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 56 డివిజన్లు, బీజేపీ 48, ఎంఐఎం 44 స్థానాలు, కాంగ్రెస్ 2 డివిజన్లు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన లింగోజీగూడ కార్పొరేటర్ హఠాన్మరణం పొందడంతో ఆ పార్టీకి ప్రస్తుతం 47 మంది కార్పొరేటర్ల బలం ఉంది. బీజేపీ విజయం సాధించిన డివిజన్లలో అధిక శాతం టీఆర్ఎస్ అభ్యర్థులు రెండో స్థానంలో ఉండగా కొన్ని చోట్ల ఎంఐఎం అభ్యర్థులు నిలిచారు. దీంతో ఓటమి పాలైన అభ్యర్థులు గెలిచిన వారు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లపై కన్ను వేశారు. అందులో వారు ఏమైనా తప్పుడు సమాచారం నమోదు చేశారని శోధిస్తూ న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెట్టి పదవికి దూరం చేయాలనే సంకల్పంతో పావులు కదుపుతున్నారు.
నమోదవుతున్న కేసులు..
జాంబాగ్ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన రాకేశ్ జైశ్వాల్ పై ఎంఐఎం అభ్యర్థి న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. అతడికి ముగ్గురు పిల్లలు ఉన్నారని, అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు తప్పుగా నమోదు చేశారని ఫిర్యాదు చేశారు.
హస్తినాపురం డివిజన్ నుంచి విజయం సాధించిన బీజేపీ కార్పొరేటర్ సుజాతా నాయక్ పై ఎన్నికల్లో ఓటమి పాలైన రమావత్ పద్మానాయక్ న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. ముగ్గురు పిల్లలున్నప్పటికీ అఫిడవిట్ లో తప్పడు సమాచారం ఇచ్చారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
గోషామహల్ నియోజకవర్గం గన్ ఫౌండ్రి డివిజన్ నుంచి గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ బీశ్వ ఓం ప్రకాశ్ పై ఓటమి పాలైన టీఆర్ఎస్ కు చెందిన మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇక్కడ గెలిచిన కార్పొరేటర్ కు రెండు చోట్ల ఓటు ఉందని, రెండు ఓటరు గుర్తింపు కార్డులు సైతం ఉన్నాయనే రుజువును ఆమె న్యాయస్థానం ముందు ఉంచినట్లు సమాచారం.
మంగళ్ హాట్ నుంచి విజయం సాధించిన బీజేపీ కార్పొరేటర్ పై సైతం టీఆర్ఎస్ కు చెందిన మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ ఫిర్యాదు చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇక్కడి నుంచి గెలిచిన శశికళకు ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ అఫిడవిట్ లో ఇద్దరినే చూపించారని, ఇందుకు రేషన్ కార్డులో ఆధారాలు ఉండగా ఆమె అందులోనూ మార్పులు చేయించి ఇద్దరు సంతానంగా చూపేడుతున్న సాక్ష్యాలను ఇప్పటికే సేకరించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇలా గ్రేటర్ పరిధిలో మొత్తం 26 మంది బీజేపీ కార్పొరేటర్లకు అర్హతలు లేకున్నా తప్పుడు సమాచారంతో ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారంటూ వారిపై అనర్హత వేటు వేయించేందుకు గులాబీ నాయకులు సిద్ధమవుతున్నారు.