- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పగ పెంచుకున్న కోతులు.. 250 కుక్క పిల్లలను పట్టుకెళ్లి ఏం చేశాయంటే..?
దిశ, ఫీచర్స్ : మహారాష్ట్రలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కోపంతో ఊగిపోయిన ఓ కోతుల గుంపు.. ఏకంగా 250 కుక్కలను చంపి పగతీర్చుకున్నాయి. బీడ్ జిల్లా, మజల్‌గావ్‌కు 10 కిలోమీటర్ల దూరంలోని లావూల్ అనే గ్రామంలోని కుక్కలు కోతి పిల్లను చంపినందుకు ప్రతీకారంగానే మిగతా కోతులు ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం.
మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. కొన్ని వీధి కుక్కలు ఒక చిన్న కోతి పిల్లను చంపేశాయి. దీంతో ఆగ్రహించిన కోతుల గుంపు చిన్న కుక్క పిల్లలను చెట్లు లేదా భవనాల మీది నుంచి విసిరేసి చంపినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. కానీ ఆ ప్రాంతంలోని కుక్కలు ఏ కోతి పిల్లపైనా దాడి చేసినట్లు లేదా చంపినట్లు నిర్ధారణ కాలేదు. ఇది ఒక పుకారు మాదిరి వ్యాపించినట్లు తెలుస్తోంది. అయితే, కోతులు ఆ ప్రాంతంలోని భవనం పైకప్పుల మీదకు చిన్న కుక్కపిల్లలను తీసుకెళ్లడం వాస్తవమేనని తెలుస్తున్నా.. అవి కుక్క పిల్లలను ఎత్తు నుంచి విసిరేసినట్లు ఎవరూ ధృవీకరించలేదు.
కుక్క పిల్లలను ఎత్తుకెళ్లిన కోతులు.. వాటిని ఇంటి పైకప్పులపై ఒంటరిగా వదిలేయడం వల్ల ఆకలితో చనిపోయే అవకాశం ఉందని అర్థమవుతోంది. అంతేకాదు కోతుల బెదిరింపుల వల్ల కుక్క పిల్లలు పైకప్పుల మీదకు వెళ్లడం లేదనేది స్థానికుల మాట. కుక్క పిల్లలను ఎవరూ పట్టించుకోకుండా వదిలేయడం వల్లే అవి చనిపోవచ్చనేది కొందరి వాదన. పైగా ఇలా కోతులు కుక్క పిల్లలను చెట్ల పైకి తీసుకెళ్తున్న సంఘటనలు అక్కడక్కడ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక విధాలుగా భయపెడుతున్న కోతులను వదిలించుకోవాలని భావించిన స్థానికులు అటవీ శాఖ అధికారులను సంప్రదించారు. కానీ వారు ఒక్క కోతిని కూడా పట్టుకోలేకపోవడం గమనార్హం.
Yoooo it’s really on sight between the dogs and monkeys in India lmaooo pic.twitter.com/kygCZnbBwS
— Beckfor D. FloW (@NewStill_FloW) December 17, 2021