'పదేళ్ల తర్వాత సీఎస్కే ఓనర్ ధోనీనే'

by Shyam |
పదేళ్ల తర్వాత సీఎస్కే ఓనర్ ధోనీనే
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీకి, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆ జట్టును ముందు నుంచీ నడిపించి మూడు సార్లు ఐపీఎల్ విజేతగా నిలబెట్టాడు. ప్రస్తుతం తన క్రికెట్ కెరీర్ చివరి దశలో ఉన్న ధోనీ, మరో పదేళ్ల తర్వాత సీఎస్కే జట్టు యజమానిగా ఎదుగుతాడని ఆ ఫ్రాంచైజీ సీఈవో విశ్వనాథన్ అభిప్రాయపడ్డాడు. ‘ధోనీది చాలా కష్టపడే మనస్తత్వం. గత ఏడాది వరల్డ్ కప్ తర్వాత అతడు క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం మనం చూడలేదు. ఈ ఏడాది మార్చి 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్ కోసం ఎంతో కష్టపడ్డాడు. ముందుగానే చెన్నై వచ్చి జట్టు సభ్యులతో కలసి కఠోరంగా ప్రాక్టీస్ చేశాడు. కాకపోతే అనూహ్యంగా ఐపీఎల్ వాయిదా పడింది. కానీ, అతడు ఎప్పటికీ అలాగే ప్రాక్టీస్ చేస్తుంటాడు’ అని విశ్వనాథన్ వెల్లడించారు. ఒకానొక సమయంలో సీఎస్కే జట్టు వరుసగా నాలుగు టోర్నీలు ఓడిపోయింది. ఆ సమయంలో ఆటగాళ్ల వద్దకు వెళ్లి, మనపై మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలమంటూ స్ఫూర్తిని నింపాడు. అప్పటి నుంచే ధోనీని ‘తళా’ అంటూ పిలువడం ప్రారంభించారని విశ్వనాథన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed