- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాంచీలో ధోనీ.. చైన్నైని వీడి !
కరోనా ప్రభావంతో ఐపీఎల్ ఏప్రిల్ 15 వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, రెండు వారాలుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేపాక్ స్టేడియంలో పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీతో పాటు జట్టు సభ్యులంతా నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చారు. కాగా, ఐపీఎల్‌ను వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోవడంతో ఆటగాళ్లు తమ సొంత ఊర్లకు వెళ్లిపోయారు. కెప్టెన్ ధోనీ సహా సురేష్ రైనా, అంబటి రాయుడు చెన్నై నుంచి ఇండ్లకు బయలుదేరారు.
ఆటగాళ్లు సొంత ఊర్లకు వెళ్లిపోతున్న సందర్భంగా యాజమాన్యం చిన్న వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. చేపాక్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ధోనీ పలువురు అభిమానులకు ఆటోగ్రాఫ్స్‌లు ఇస్తూ.. సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. ఐపీఎల్‌పై స్పష్టత వచ్చిన తర్వాత ఆటగాళ్లు తిరిగి చెన్నై వస్తారని సమాచారం.
tags : IPL, BCCI, Coronavirus, CSK, Ranchi, Dhoni, Raina, Send off ceremony