ముంచెత్తిన వరద.. 150 మంది గల్లంతు

by Anukaran |   ( Updated:2021-02-07 03:09:40.0  )
ముంచెత్తిన వరద.. 150 మంది గల్లంతు
X

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తర్ ఖండ్ లో వరదలు సంభవించాయి. ఈ వరదల కారణంగా పవర్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న 150కార్మికులు గల్లంతయ్యారు. ప్రస్తుతం వారి ఆచూకీ కోసం కేంద్ర రాష్ట్ర బలగాలతో సహయక చర్యల్ని ముమ్మరం చేశాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలో ధౌలిగంగా నదీ ప్రవాహం ఉదృతి పెరిగింది. దీంతో జిల్లాలోని రైనీ గ్రామ సమీపంలోని తోపాన్ వద్ద ఉన్న రిషిగంగా పవర్ ప్రాజెక్ట్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న 150మంది కార్మికులు గల్లంతయ్యారు. ప్రస్తుతం వారి ఆచూకీకోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీ ఆర్ఎఫ్ భద్రతా బలగాలతో పాటు స్థానిక జిల్లా యంత్రాంగం రక్షణ చర్యల్ని ముమ్మరం చేసినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా యాత్రంగం ధౌలిగంగ రివర్ సమీప గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీ చెప్పారు. మరోవైపు వరదలు సంభవించిన ప్రాంత ప్రజల్ని రక్షించేందుకు వందలాదిమంది ఇండో- టిబెటన్ పోలీసులు రంగంలోకి దిగినట్లు చెప్పారు.ః

చమోలీ జిల్లా పోలీసులు ఏం చెబుతున్నారు

తపోవన్ ప్రాంతంలో ఉన్న రివర్ ప్రాజెక్ట్ పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు. భద్రతా చర్యల కోసం రెండు బృందాలుగా ఇండో- టిబెటన్ బోర్డ్ పోలీసులు, డెహ్రాడూన్ నుంచి మూడు బృందాలుగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ప్రత్యేక విమానాల ద్వారా ఘటన స్థలానికి చేరుకున్నట్లు చమోలీ జిల్లా పోలీసులు చెబుతున్నారు. వీరితో పాటు ఎస్డీఆర్ఎఫ్, స్థానికంగా ఉన్న బలగాలు ఇప్పటికే ఆ ప్రాంతానికి వెళ్లగా.., ధౌలిగంగా సహాయాక చర్యల్ని పర్యవేక్షించేందుకు కేంద్రం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ వస్తున్నట్లు చెప్పారు.

హై అలెర్ట్

వరదలు సంభవించిన ధౌలిగంగా నది ప్రాంతానికి సమీంలో ఉన్న నందదేవి అనే మంచు వరదలా పారే ప్రాంతంలో హై అలెర్ట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. నది ఉద్రిక్తతల్ని 24గంటలు పరిశీలిస్తూ భద్రతా బలగాలకు వరదసహాయానికి సంబంధించి సూచనల్ని ఇస్తున్నామని చమోలీ జిల్లా అధికారులు వెల్లడించారు.

అత్యవసర సాయం కావాలంటే ఈ నెంబర్‌కి కాల్ చేయండి

వరదపై సమాచారం అందుకున్న ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ 1070 మరియు 9557444486 ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయని, వాటికి కాల్ చేయోచ్చని ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed