- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఈ స్కూల్‌లో వండేది టీచర్లే.. గదులు శుభ్రం చేసేది విద్యార్థులు'
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండల కేంద్రంలోని కొండనాగుల జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ముందు విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని పెట్టాలని ప్రజాతంత్ర యువజన సమాఖ్య, డీవైఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ కమిటీల ఆధ్వర్యంలో పాఠశాల గేటు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వర్ధన్ సైదుల్ మాట్లాడుతూ గత మూడు రోజులుగా మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో ఉంటున్నారన్నారని, మధ్యాహ్నం భోజనం కార్మికులకు గత సంవత్సరం బిల్లులు రాక, జీతాలు చెల్లించకపోవడంతో మధ్యాహ్న భోజనం వండడానికి నిరాకరించారని, దీంతో పాఠశాల హెచ్ ఎం, టీచర్లు కలిసి వడ్డించారని తెలిపారు.
ఈ సమస్యపై స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స్కూల్ చైర్మన్, డీఈఓ, ఎంఈఓ, స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చినా ఎవరూ స్పందించక పోవడం చాలా సిగ్గుచేటన్నారు. ఎంతోమంది పేద విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారని, పాఠశాలలో స్వీపర్, అటెండర్ లేకపోవడంతో విద్యార్థులే తరగతి గదులను శుభ్రం చేసుకుంటున్నారని, ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు సయ్యద్, రవి, సుందర్, మహేష్, విష్ణు, వెంకటేష్, శివ, జగపతి రాజేష్ లు పాల్గొన్నారు.