- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మావోయిస్టుల ఇలాఖాలో డీజీపీ టూర్.. వారికి కీలక ఆదేశాలు
దిశ, భద్రాచలం (చర్ల): తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం ఛత్తీస్‌గఢ్‌కి సరిహద్దుగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల అటవీప్రాంత చెన్నాపురం గ్రామ పోలీస్ బేస్ క్యాంపుని సందర్శించారు. ఆయనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్‌పి సునీల్‌దత్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. ఈనెల 2వ తేదీ నుంచి 8 వరకు మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ 21వ వార్షికోత్సవ వారోత్సవాల నేపథ్యంలో ఒకరోజు ముందు డీజీపీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి చెన్నాపురం మీదుగా మావోయిస్టులు తెలంగాణ (కొత్తగూడెం జిల్లా)లోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేయడం కోసం ఇటీవల చెన్నాపురంలో పోలీస్ బేస్ క్యాంపు ఏర్పాటు చేశారు.
హెలికాప్టర్ ద్వారా చెన్నాపురం చేరుకున్న డీజీపీ మహేందర్‌రెడ్డి అక్కడి భద్రతా బలగాలకు పలు సూచనలు చేశారు. పీఎల్‌జీఏ వారోత్సవాలు జరగకుండా కట్టడి చేయాలని సూచించినట్లు సమాచారం. సరిహద్దుల్లో నిఘా పెంచాలని, ఛత్తీస్‌గఢ్ ప్రభావం తెలంగాణలో పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని స్థానిక పోలీస్, సీఆర్పీఎఫ్ అధికారులకు సూచించారు.