ఆ ఆలయంలో అంతుచిక్కని మిస్టరీలు.. ఇప్పటికీ వినిపిస్తున్న వింత శబ్దాలు

by Sumithra |
ఆ ఆలయంలో అంతుచిక్కని మిస్టరీలు.. ఇప్పటికీ వినిపిస్తున్న వింత శబ్దాలు
X

దిశ, ఫీచర్స్ : భారతదేశంలో అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. అలాగే వాటికి సంబంధించిన పురాణ కథలు కూడా వెలుగు చూశాయి. హిందూ దేవాలయాల్లో ని ఒక్కో ఆలయంలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. అటువంటి ఆలయం భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలోని థాలిలో ఉంది. ఈ ఆలయంలో ఇప్పటికీ అంతుచిక్కని ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. ఆ మిస్టరీలేంటి, ఆ ఆలయం ఎక్కడ ఉంది ఇప్పుడు తెలుసుకుందాం..

కర్నాటకలోని థాలిలో అద్భుతమైన వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని కర్ణాటకలోని హౌసా కన్నంబడిలో కృష్ణ రాజ సాగర డ్యామ్ సమీపంలో నిర్మించారు. ఇక్కడ శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తున్న విగ్రహం నెలకొంది ఉంది. వేణు అంటే తమిళంలో వేణువు అని అర్థం. పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుడు తన ఆవుల మందతో ఇక్కడ కూర్చొని వేణువును వాయించేవాడని, అందుకే నేటికీ ఈ ఆలయంలో వేణునాదం వినిపిస్తుందని అక్కడి ప్రజలు చెబుతారు. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారట.

కృష్ణ రాజ సాగర డ్యామ్ సమీపంలో ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయాన్ని హొయసల రాజవంశీయులు నిర్మించారు. 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంది. కేఆర్ఎస్ ఆనకట్ట పూర్తయిన తర్వాత, కన్నాంబడి మొత్తం నీటిలో మునిగిపోయింది. అలాగే ఆలయం కూడా 70 సంవత్సరాలకు పైగా నీటిలో మునిగిపోవడంతో 2011 లో పునరుద్ధరించారు.

ఈ ఆలయంలో రెండు వైపులా వరండాలు ఉన్నాయి. దాని చుట్టూ యాగశాల, వంటగది ఉన్నాయి. ఈ ఆలయంలో దుస్తులు, ఆభరణాల గదులు, గర్భగుడి కూడా ఉంది. ప్రవేశ ద్వారం ఎదురుగా ఉన్న గదిలో శ్రీకృష్ణుడి చిత్రపటం, దక్షిణాన ఉన్న గదిలో గోపాలకృష్ణుని విగ్రహం ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed